Pakistan Cricketers : భారత్ తరఫున ఆడిన ముగ్గురు పాకిస్థాన్ క్రికెటర్లు వీరే
IND Vs PAK : భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎక్కడా లేని క్రేజ్. టీవీలకు అతుక్కుపోయి చూసేవారూ ఉన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ వివాదాల కారణాంగా ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇంట్రస్ట్ ఎక్కువ. అయితే ఓ ముగ్గురు పాకిస్థాన్ క్రికెటర్లు ఇండియా తరఫున ఆడారని తెలుసా?
ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్(IND Vs PAK Match) అంటే.. టీవీల టీఆర్పీ పెరిగిపోతుంది. డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటే.. ఎక్కడా లేని వ్యూస్ వచ్చేస్తాయి. దాయాదితో పోరు అంటే.. కేవలం మనకే కాదు.. ప్రపంచంలోని చాలా మందికి ఇంట్రస్ట్ ఉంటుంది. పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే.. ఎమోషనల్ తో కూడుకున్నది. గెలిస్తే.. సంబరాలు, ఓడితే.. ఇంకా బాగా ఆడి గెలవాల్సింది కదా అనే మాటలు. త్వరలో షురూ కాబోయే వరల్డ్ కప్(World Cup)లోనూ రెండు దేశాలు మైదానంలో పోటీ పడనున్నాయి.
భారత్ పాక్ మ్యాచ్ అంటే.. ప్రపంచం మెుత్తం చూస్తుంది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక, రాజకీయ, సాంస్కృతి కారణాలు ఇందుకు కారణమయ్యాయి. ఇరు దేశాల మధ్య ఆట అంటే.. భావోద్వేగాలతో ముడి పడి ఉంటుంది. భారత్-పాక్ మ్యాచ్(India pakistan match) అంటే.. రెండు దేశాల ప్రజలు ఆసక్తిగా చూస్తారు. అయితే ఓ ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ముగ్గురు పాకిస్థాన్ ఆటగాళ్లు భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు.
ఇందులో మెుదటి వ్యక్తి అబ్దుల్ హఫీజ్ కర్దార్. 1947లో రెండు దేశాల విభజనకు ముందు భారత్ తరఫున పాల్గొన్నాడు. కానీ చివరకు పాకిస్థాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. విభజనకు ముందు హఫీజ్ ఇండియా తరఫున మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. తర్వాత పాకిస్థాన్ వెళ్లి 26 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. పాకిస్థాన్ క్రికెట్ కు మెుదటి కెప్టెన్ గా వ్యవహరించాడు. అతడిని పాకిస్థాన్ క్రికెట్ పితామహుడు అని కూడా అంటారు.
ఇక రెండో వ్యక్తి గుల్ మహ్మద్. ఇదు దేశాలకు ప్రాతినిధ్యం వహించాడు. భారతదేశం కోసం మెుత్తం ఎనిమిది మ్యాచ్ లు ఆడాడు. 1952లో పాకిస్థాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే మహ్మద్ ఎక్కువ కాలం పాకిస్థాన్ జట్టులో లేడు. ఫామ్ కోల్పోవడంతో తొలగించారు. ఒక్క టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు.
విభజన కారణంగా భారత్, పాక్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న మూడో ఆటగాడు అమీర్ ఎలాహి. భారత్-పాకిస్థాన్ విభజనకు ముందు అమీర్ ఇండియా తరఫున ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తర్వాత పాకిస్థాన్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ఐదు అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. పైన చెప్పిన ముగ్గురు ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. భారత్-పాక్ తరఫున ఆడిన ఆటగాళ్లుగా చరిత్రలో నిలిచారు.