Jadeja Dance: జడేజా ఆల్ రౌండరే.. అమెరికా వీధుల్లో జడ్డూ వేసిన స్టెప్పులు చూశారా?-cricket news in telugu jadeja dance on america streets ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Cricket News In Telugu Jadeja Dance On America Streets

Jadeja Dance: జడేజా ఆల్ రౌండరే.. అమెరికా వీధుల్లో జడ్డూ వేసిన స్టెప్పులు చూశారా?

Hari Prasad S HT Telugu
Aug 07, 2023 09:56 PM IST

Jadeja Dance: జడేజా ఆల్ రౌండరే.. అమెరికా వీధుల్లో జడ్డూ వేసిన స్టెప్పులు చూశారా? వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లో అదరగొట్టిన తర్వాత రెస్ట్ ఇవ్వడంతో అతడు యూఎస్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.

రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా (AFP)

Jadeja Dance: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు.. బయటకు కూడా ఆల్ రౌండరే. తాజాగా అతడు అమెరికా వీధుల్లో ముక్కాలా ముక్కాబులా పాటకు వేసిన స్టెప్పుల వీడియో తెగ వైరల్ అవుతోంది. వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు రెస్ట్ ఇవ్వడంతో జడ్డూ యూఎస్ఏలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి అతడు ఈ టూర్ కు వెళ్లాడు.

ట్రెండింగ్ వార్తలు

అతడు ఓ ఈవెంట్లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోమవారం (ఆగస్ట్ 7) చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. జీవితం మీకు మండేలను ఇస్తే జడ్డూలాగా మార్చుకోండి అనే క్యాప్షన్ తో ఈ వీడియోను సీఎస్కే పోస్ట్ చేయడం విశేషం. బ్యాక్‌గ్రౌండ్లో సూపర్ హిట్ సాంగ్ ముక్కాలా ముక్కాబులా ప్లే అవుతుంటే.. జడేజా రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు.

మరోవైపు వెస్టిండీస్ తో వరుసగా రెండో టీ20లోనూ ఇండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో 2 వికెట్లతో టీమిండియా పరాజయం పాలైంది. విండీస్ వికెట్ కీపర్ నికొలస్ పూరన్ 67 పరుగులతో ఒంటరి పోరాటం చేసి తన జట్టును గెలిపించాడు. ఒక దశలో 129 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినా.. పూరన్ మెరుపులతో 5 టీ20ల సిరీస్ లో విండీస్ 2-0 ఆధిక్యం సంపాదించింది.

టెస్ట్, వన్డే సిరీస్ లను గెలిచిన ఇండియా.. ఇప్పుడు టీ20 సిరీస్ గెలవాలంటే మాత్రం మిగిలిన మూడు మ్యాచ్ లలోనూ విజయం సాధించాల్సిందే. అయితే రెండు మ్యాచ్ లలోనూ బ్యాటర్ల వైఫల్యం వెంటాడింది. దీనిపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా పబ్లిగ్గానే విమర్శలు చేశాడు.

WhatsApp channel