Shami Alimony case: కోర్టులో టీమిండియా పేసర్ షమీకి ఎదురుదెబ్బ.. భార్యకు భరణం చెల్లించాలని తీర్పు-court orders mohammed shami to pay monthly alimony to estranged wife hasin jahan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shami Alimony Case: కోర్టులో టీమిండియా పేసర్ షమీకి ఎదురుదెబ్బ.. భార్యకు భరణం చెల్లించాలని తీర్పు

Shami Alimony case: కోర్టులో టీమిండియా పేసర్ షమీకి ఎదురుదెబ్బ.. భార్యకు భరణం చెల్లించాలని తీర్పు

Maragani Govardhan HT Telugu
Jan 24, 2023 06:51 AM IST

Shami Alimony case: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన మాజీ భార్య హసిన్ జహన్‌కు నెలవారీ భరణం తప్పకుండా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే ఈ భరణం మొత్తంపై హసిన్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.

మహమ్మద్ షమీ
మహమ్మద్ షమీ (ANI )

టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై అతడి భార్య హసిన్ జహన్ నాలుగేళ్ల కిందట సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అతడు తనను వేధిస్తున్నాడని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోల్‌కతా కోర్టులో గృహహింస, లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసింది. షమీ నుంచి విడిపోవాలనుకుంటున్నానని, తనకు నెలవారీ భరణం ఇప్పించాల్సిందిగా వ్యాజ్యంలో పేర్కొంది. తాజాగా సోమవారం ఈ కేసులో తుది తీర్పును వెలువరించింది న్యాయస్థానం. మాజీ భార్య హసిన్ జహన్‌కు నెలవారీగా రూ.50 వేలు భరణం చెల్లించాల్సిందిగా షమీని కోర్టు ఆదేశించింది.

భరణం విషయంలో కోర్టు తీర్పుపై హసిన్ జహన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. తనకు నెలవారీ ఖర్చుల కింద రూ.10 లక్షల షమీని ఇప్పించాల్సిందిగా తన పిటీషన్‌లో పేర్కొంది. ఇందులో రూ.7 లక్షలు తన వ్యక్తిగత ఖర్చుల కోసం కాగా.. రూ.3 లక్షలు తన కూతురు నిర్వహణ కోసం ఇప్పించాల్సిందికి కోరింది. కానీ న్యాయస్థానం రూ.50 వేలు భరణంతో సరిపెట్టింది.

షమీపై హసిన్ కేసు..

తనను వేధిస్తున్నాండటూ హసిన్ జహన్ జాదవ్‌పుర్ పోలీస్ స్టేషన్‌లో షమీపై ఫిర్యాదు చేసింది. అతడిపై లైంగిక వేధింపులు, గృహహింస ఆరోపణలు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు షమీకి నాన్ బెయిల్‌బుల్ ఛార్జీలను విధించారు. తనను షమీతో పాటు అతడి కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధించారని, తాను ఉత్తరప్రదేశ్‌లోని పుట్టించికి ఎప్పుడు వెళ్లినా హింసించే వారని ఫిర్యాదులో పేర్కొంది. కావాలంటే షమీ ఇరుగుపొరుగువారినైనా అడగండని తెలిపింది. రెండేళ్లుగా విడాకుల కోసం చూస్తున్నానని, అందుకే తాను మౌనంగా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టం చేసింది. షమీ తనను తీవ్రంగా హింసించాడని, అతడి నుంచి నేను విడిపోయేందుకు ఏమైతే చేయాలనుకున్నాడో అంతా చేశాడని స్పష్టం చేసింది. వేర్వేరు నెంబర్లో ఫోన్ చేసి చాలా సార్లు బెదిరించాడని తన ఫిర్యాదులో ఆరోపించింది.

ఇదిలా ఉంటే మొదటి నుంచి హసిన్ జహన్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాడు షమీ. సోషల్ మీడియా వేదికగా ఆమె ఆరోపణలపై ఎప్పటికప్పుడు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. తనను అప్రతిష్ట పాలు చేయాలనే ఆమె ఈ విధంగా తనపై ఆరోపణలు చేస్తోందని తెలిపాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్