Commonwealth Games 2026: కామన్వెల్త్‌ గేమ్స్‌లోకి తిరిగొచ్చిన షూటింగ్‌.. రెజ్లింగ్‌ ఔట్‌-commonwealth games 2026 again welcome shooting and left out wrestling ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Commonwealth Games 2026 Again Welcome Shooting And Left Out Wrestling

Commonwealth Games 2026: కామన్వెల్త్‌ గేమ్స్‌లోకి తిరిగొచ్చిన షూటింగ్‌.. రెజ్లింగ్‌ ఔట్‌

Hari Prasad S HT Telugu
Oct 05, 2022 09:54 AM IST

Commonwealth Games 2026: కామన్వెల్త్‌ గేమ్స్‌లోకి షూటింగ్‌ తిరిగొచ్చింది. అయితే అదే సమయంలో రెజ్లింగ్‌ను తీసేశారు. 2026 గేమ్స్‌లో ఉండబోయే స్పోర్ట్స్‌ లిస్ట్‌ను మంగళవారం (అక్టోబర్‌ 4) అనౌన్స్‌ చేశారు.

కామన్వెల్త్ గేమ్స్ లోకి తిరిగొచ్చిన షూటింగ్
కామన్వెల్త్ గేమ్స్ లోకి తిరిగొచ్చిన షూటింగ్

Commonwealth Games 2026: ఇండియాకు కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఒక గుడ్‌న్యూస్‌, మరో బ్యాడ్‌న్యూస్‌ వచ్చాయి. 2022 గేమ్స్‌ నుంచి మిస్‌ అయిన షూటింగ్‌ 2026 గేమ్స్‌కు తిరిగి వచ్చింది. ఇండియాకు మెడల్స్‌ పంట పండించిన షూటింగ్‌ తిరిగి రావడం గుడ్‌న్యూసే. అయితే అదే సమయంలో రెజ్లింగ్ మిస్‌ కావడం మింగుడు పడటం లేదు.

ట్రెండింగ్ వార్తలు

2022 గేమ్స్‌లో ఈ రెజ్లింగ్‌లోనే ఇండియాకు 12 మెడల్స్‌ (6 గోల్డ్‌, 1 సిల్వర్‌, 5 బ్రాంజ్‌) వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 2026లో విక్టోరియాలో జరగబోయే కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఉండబోయే స్పోర్ట్స్‌ లిస్ట్‌ను కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ప్రకటించింది. ఇందులో షూటింగ్‌ను చేర్చింది. నిజానికి కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియాకు అత్యధిక మెడల్స్‌ అందించింది ఈ షూటింగే.

షూటింగ్‌లో ఇప్పటి వరకూ ఇండియాకు 135 మెడల్స్‌ వచ్చాయి. అందులో 63 గోల్డ్‌ మెడల్స్ ఉన్నాయి. ఒక స్పోర్ట్‌లో ఇండియా సాధించిన అత్యధిక గోల్డ్‌ మెడల్స్‌ ఇవే. ఇక ఈ లిస్ట్‌లో రెజ్లింగ్‌ రెండోస్థానంలో ఉంది. ఈ ఆటలో ఇండియాకు 114 మెడల్స్ (49 గోల్డ్) వచ్చాయి. ఇప్పుడీ రెజ్లింగ్‌ 2026 గేమ్స్‌లో లేకపోవడం ఇండియా ఓవరాల్‌ మెడల్‌ సంఖ్యపై ప్రభావం చూపేదే.

ఇక ఆర్చరీకి కూడా కామన్వెల్త్‌ గేమ్స్‌లో చోటు దక్కలేదు. నిజానికి 2026 గేమ్స్‌లో షూటింగ్‌, రెజ్లింగ్‌లను చేర్చాలని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌.. కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ను కోరింది. ఈ రెండు స్పోర్ట్స్‌ వల్ల ఈవెంట్‌ వైభవం మరింత పెరుగుతుందని కూడా చెప్పింది. అయితే ఫెడరేషన్‌ మాత్రం షూటింగ్‌ను చేర్చి, రెజ్లింగ్‌ను తొలగించింది.

2026 గేమ్స్‌లో మొత్తం 20 క్రీడలు, 26 క్రీడాంశాలు ఉండనున్నట్లు కామన్వెల్త్ గేమ్స్‌ ఫెడరేషన్ వెల్లడించింది. ఈ గేమ్స్‌లోకి తొలిసారి కోస్టల్‌ రోవింగ్‌, గోల్ఫ్‌, బీఎంఎక్స్‌ రానున్నాయి.

ఇవీ మొత్తం స్పోర్ట్స్‌ లిస్ట్‌

ఆక్వాటిక్స్‌ (స్విమ్మింగ్‌, పారా స్విమ్మింగ్‌, డైవింగ్‌)

అథ్లెటిక్స్‌ & పారా అథ్లెటిక్స్‌

బ్యాడ్మింటన్‌

బాస్కెట్‌బాల్‌, వీల్‌చెయిర్‌ బాస్కెట్‌బాల్‌

బాక్సింగ్‌

బీచ్‌ వాలీబాల్‌

కోస్టల్‌ రోవింగ్‌

క్రికెట్‌ టీ20 (వుమెన్‌)

సైక్లింగ్‌ (బీఎంఎక్స్‌)

సైక్లింగ్‌ (మౌంటేన్‌ బైక్‌)

సైక్లింగ్‌ (రోడ్‌)

సైక్లింగ్‌ (ట్రాక్‌ & పారా ట్రాక్‌)

గోల్ఫ్‌

జిమ్నాస్టిక్స్‌ (ఆర్టిస్టిక్‌)

హాకీ

లాన్‌ బౌల్స్‌

నెట్‌ బాల్‌

రగ్బీ సెవన్స్‌

షూటింగ్‌

స్క్వాష్‌

టేబుల్‌ టెన్నిస్‌

ట్రయథ్లాన్‌

వెయిట్‌లిఫ్టింగ్‌

WhatsApp channel