Brian Lara: స‌న్ రైజ‌ర్స్ హెడ్ కోచ్‌గా లారా నియామకం-brian lara appointed head coach of sunrisers hyderabad team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Brian Lara: స‌న్ రైజ‌ర్స్ హెడ్ కోచ్‌గా లారా నియామకం

Brian Lara: స‌న్ రైజ‌ర్స్ హెడ్ కోచ్‌గా లారా నియామకం

HT Telugu Desk HT Telugu
Sep 03, 2022 02:15 PM IST

Brian Lara: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్‌కు కొత్త కోచ్‌గా వెస్టిండీస్ మాజీ ఆట‌గాడు బ్రియాన్ లారా ఎంపిక‌య్యాడు. లారాను కోచ్‌గా నియమించినట్లుగా శ‌నివారం స‌న్‌రైజ‌ర్స్ యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.

బ్రియాన్ లారా
బ్రియాన్ లారా (Twitter)

Brian Lara: ఐపీఎల్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ టీమ్ కు హెడ్ కోచ్ గా వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా నియమితుడయ్యాడు. అతడిని హెడ్ కోచ్ గా ప్రమోట్ చేస్తున్నట్లు సన్ రైజర్స్ యాజమాన్యం శనివారం ప్రకటించింది. ఐపీఎల్ 2022 ఎడిషన్ లో సన్ రైజర్స్ జట్టుకు టామ్ మూడీ ప్రధాన కోచ్ గా వ్యవహరించాడు. అతడి మార్గదర్శకత్వంలో పధ్నాలుగు మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ కేవలం ఆరు విజయాలు మాత్రమే అందుకున్నది. లీగ్ దశలోనే వెనుతిరిగి అభిమానులను నిరాశపరిచింది.

ఈ వైఫల్యం నుంచి బయట పడి వచ్చే సీజన్ లో జట్టును గాడిన పెట్టాలనే ఆలోచనలో లారాను కోచ్ గా నియమించినట్లు తెలిసింది. 2022 ఐపీఎల్ ఎడిషనల్ లో సన్ రైజర్స్ కు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా, స్ట్రాటెజిక్ అడ్వైజర్ గా లారా వ్యవహరించాడు. అతడిని కోచ్ గా ప్రమోట్ చేసింది సన్ రైజర్స్ యాజమాన్యం. అప్ కమింగ్ ఐపీఎల్ సీజన్స్ కు లారా ప్రధాన కోచ్ గా వ్యవహరించనున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నది.

టీ20 టీమ్ కు లారా ప్రధాన కోచ్ బాధ్యతల్ని చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అతడి సారథ్యంలో వచ్చే ఐపీఎల్ సన్ రైజర్స్ ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కోచ్ తో పాటు కెప్టెన్ ను ఆటగాళ్లను కూడా మార్చేందుకు సన్ రైజర్స్ ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది.

WhatsApp channel

టాపిక్