Bumrah - Kl Rahul: బుమ్రా, రాహుల్ రీఎంట్రీపై బీసీసీఐ మెడికల్ టీమ్ ఏమన్నదంటే?
Bumrah - Kl Rahul: బుమ్రా, కేఎల్ రాహుల్ రీఎంట్రీపై బీసీసీఐ మెడికల్ టీమ్ కీలకమైన అప్‌డేట్‌ను రివీల్ చేసింది. గాయాల కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరమైన బుమ్రా, రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో రిహాబిలిటేషన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
Bumrah - Kl Rahul: టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్స్ బుమ్రా, కేఎల్ రాహుల్ రీఎంట్రీపై బీసీసీఐ మెడికల్ టీమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గాయాల కారణంగా టీమ్ ఇండియాకు దూరమైన బుమ్రా, కేఎల్ రాహుల్‌తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీలో బీసీసీఐ మెడికల్ టీమ్ ఆధ్వర్యంలో రిహాబిలిటేషన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ పూర్తిగా కోలుకున్నట్లు బీసీసీఐ మెడికల్ టీమ్ పేర్కొన్నట్లు సమాచారం.
ఎన్‌సీఏ ఆర్గనైజ్ చేసిన ప్రాక్టీస్ మ్యాచ్‌లలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ ఆడినట్లు తెలిసింది. వారి బౌలింగ్ శైలి పూర్వపు స్థాయిలో ఉందని, చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో ఇద్దరు బౌలింగ్ చేసినట్లు మెడికల్ టీమ్ మెంబర్ ఒకరుతెలిపారు. త్వరలోనే వారి రీఎంట్రీపై ఫైనల్ డిసెషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆసియా కప్, వరల్డ్ కప్ నేపథ్యంలో బుమ్రా జట్టులోకి రావడం టీమ్ ఇండియా బలంగా మారనుంది.
ఈ నేపథ్యంలో ఆగస్ట్‌లో ఐర్లాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్ కు బుమ్రాను ఎంపికచేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ఆ సిరీస్‌ను అనుసరించే బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 25న ఆస్ట్రేలియాపై చివరి ఇంటర్‌నేషనల్ మ్యాచ్ ఆడాడు బుమ్రా. మరోవైపు టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్స్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మాత్రం గాయం నుంచి ఇంకా కోలుకోలేదని తెలిసింది.
జట్టు సామర్థ్యాలకు తగినట్లుగా పూర్తి ఫిట్‌నెస్ ను వీరిద్దరు అందుకోలేదని సమాచారం. రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు ఫిట్‌నెస్ ట్రైనింగ్‌కు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీరిద్దరు బ్యాటింగ్ సాధన చేస్తోన్నట్లు సమాచారం. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్, శ్రేయస్ అయ్యర్ కోలువడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.