MS Dhoni: ధోనీకూడా బీసీసీఐ రూల్ ఫాలో కావాల్సిందే - సౌతాఫ్రికా లీగ్ లో అనుమతి నిరాకరణ-bcci denies permission to dhoni as mentor in south africa t20i league ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ms Dhoni: ధోనీకూడా బీసీసీఐ రూల్ ఫాలో కావాల్సిందే - సౌతాఫ్రికా లీగ్ లో అనుమతి నిరాకరణ

MS Dhoni: ధోనీకూడా బీసీసీఐ రూల్ ఫాలో కావాల్సిందే - సౌతాఫ్రికా లీగ్ లో అనుమతి నిరాకరణ

HT Telugu Desk HT Telugu
Aug 14, 2022 03:13 PM IST

ఈ ఏడాది ప్రారంభంకానున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ లో జోహెన్నస్ బర్గ్ ఫ్రాంచైజ్ ను సీఎస్‌కే కొనుగులు చేయడంతో ఆ టీమ్ కు ధోనీ మెంటర్ గా వ్యహరించనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ టీమ్ ఆశలకు బీసీసీఐ గండికొట్టినట్లు తెలిసింది.

<p>మహేంద్ర సింగ్ ధోనీ</p>
మహేంద్ర సింగ్ ధోనీ (twitter)

ఇండియన్ క్రికెట్ లోనే కాకుండా ఐపీఎల్ లోనూ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్స్ లో ఒకరిగా మహేంద్ర సింగ్ ధోనీ నిలిచారు. ధోనీ సారథ్యంలోనే ఐపీఎల్ లో చెన్నైని నాలుగు సార్లు విజేతగా నిలిచింది. 2022లో అన్ని ఫార్మెట్స్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన ధోనీ కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన నేపథ్యంలో అతడు కొత్తగా ప్రారంభం కానున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ లో భాగం కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఐపీఎల్ స్ఫూర్తితో ఈ ఏడాది సౌతాఫ్రికా ఆరు టీమ్ లతో టీ20 లీగ్ లను నిర్వహించబోతున్నది. వీటిలో జోహన్నెస్ బర్గ్ టీమ్ ను సీఎస్ కే కొనుగోలు చేసింది. సీఎస్‌కే మెంటర్ గా ఉన్న జోహెన్నస్ బర్గ్ టీమ్ కు కూడా ఆ బాధ్యతను చేపట్టబోతున్నట్లు ప్రచారం జరిగింది. ధోనీని జోహెన్నస్ బర్గ్ టీమ్ కు మెంటార్ గా నియమించే అవకాశాన్ని కల్పించమని సీఎస్‌కే యాజమాన్యం బీసీసీఐ ని కోరినట్లు తెలిసింది. కానీ సీఎస్‌కే ప్రతిపాదనను బీసీసీఐ తోసిపుచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం నేషనల్, ఇంటర్ నేషనల్స్ మాత్రమే కాకుండా డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్లకు మాత్రమే విదేశీ లీగ్స్ లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇస్తోంది. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్ లో చెన్నై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండటంతో అతడికి సౌతాఫ్రికాలో లీగ్ ఆడేందుకు బీసీసీఐ అనుమతిని నిరాకరించినట్లు తెలిసింది. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన తర్వాతే ధోనీ సౌతాఫ్రికా లీగ్ లో ఆడవచ్చని స్పష్టం చేసినట్లు సమాచారం. బీసీసీఐ నిర్ణయంపై పలువురు దేశీయ, విదేశీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. విదేశీ లీగ్ లలో ఆడేందుకు అన్ని దేశాల బోర్డ్ లు తమ క్రికెటర్లను అనుమతిస్తున్నాయని, వాటికి లేని నిబంధనలు భారత క్రికెటర్లకు ఎందుకో అర్థం కావడం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ ఆడమ్ గిల్ క్ట్రిస్ వ్యాఖ్యానించాడు.

Whats_app_banner

టాపిక్