Black color: నలుపు రంగు నిజంగానే అశుభకరమైనదా? నల్లటి వస్తువులు ఇంట్లో ఉండకూడదా?
Black color: నలుపు రంగు అనగానే అశుభం అనుకుంటారు. అందుకే నలుపు రంగుని పట్టించుకోరు. నిజానికి నలులు శుభ సూచికం.
Black color: నలుపు రంగు అనగానే అశుభంగా చాలా మంది భావిస్తారు. బయటకి వెళ్లేటప్పుడు నల్ల పిల్లి, నల్ల కుక్క వంటివి ఏవి ఎదురొచ్చిన మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కాసేపు కూర్చుని మంచినీళ్లు తాగి బయటకి వెళతారు. నలుపు దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు.
నిజానికి నలుపు రంగు చాలా గొప్పది. నలుపు నారాయణ మెచ్చు తెలుపు ఎవరు మెచ్చును అంటారు. చర్మం దగ్గర నుంచి వేసుకునే దుస్తుల వరకు నలుపు రంగు అంటే చాలా మంది అయిష్టంగా ఉంటారు. వాటిని దూరం పెట్టేస్తారు. కానీ కొంతమందికి నలుపు ఇచ్చిన కళ వేరే ఏవి ఇవ్వవు. రంగులన్నీ కలిస్తే పుట్టేది నలుపు రంగు. వర్ణ శాస్త్రం ప్రకారం నలుపు హుందాతనాన్ని, అధికారాన్ని సూచిస్తుంది. విష్ణుమూర్తి అవతారలైన రాముడు, కృష్ణుడు మాత్రమే కాదు పురాణాలలో అత్యంత సౌందర్యవంతులైన ద్రౌపది, శకుంతల వంటి వాళ్ళు కూడా నల్లని మేని ఛాయ కలిగిన వాళ్ళు ఉన్నారు.
నలుపు రంగు అశుభానికి ఎంత మాత్రం సంకేతం కాదు. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే అయ్యప్ప స్వామి భక్తులు మాల ధారణ సమయంలో నలుపు రంగు దుస్తులు ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారికి నల్ల చీరలు ధరింపజేస్తారు. ఆలయానికి వచ్చిన స్త్రీలు నల్లని గాజులని అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తారు.
నలుపు రంగు శుభ సూచికం కాదా?
త్రిగుణాలలో ఎరుపు రాజసానికి, నీలం సాత్వికానికి, నలుపు రంగు తామస గుణాన్ని సూచిస్తుందని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు. తామసం అంటే క్రోధం. వెలుతురు జ్ఞానానికి ప్రతీకగా నిలిస్తే చీకటి అజ్ఞానానికి సంకేతంగా పరిగణిస్తారు. నలుపు రంగు చీకటికి చిహ్నం. అది మాత్రమే కాదు దుఖానికి, నిరసనకి నలుపు రంగు చిహ్నంగా ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భర్త చనిపోయిన మహిళలు తెలుపు రంగు వస్త్రాలకు బదులుగా నలుపు రంగు ధరిస్తారు.
నలుపు రంగు వేడిని త్వరగా గ్రహిస్తుంది. అందుకే ఎండకి నలుపు రంగు దుస్తులు వేసుకుంటే చర్మం మంటగా ఉనునటి. అలాగే ప్రమాదాలని త్వరగా ఆకర్షిస్తుందట. అందుకే చాలా మంది నాలుపుని అశుభ సూచకంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నలుపు రంగు రాహువుకి సంబంధించిందిగా పేర్కొంటారు. అందుకే నలుపు రంగు దూరం పెడతారు. కానీ వాస్తవానికి నలుపు చాలా మంచిది.
నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది
పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు నలుపు రంగు ఇష్టపడతారు. కానీ నమ్మకాల దగ్గరకి వచ్చేసరికీ మాత్రం నలుపు పక్కన పెట్టేస్తారు. నలుపు పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. నరదిష్టి తగలకుండా కాపాడుతుంది. అందుకే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నలుపు రంగు దారం కాళ్ళకి కట్టుకుంటారు. ఇలా చేస్తే చెడు కన్ను దృష్టి తమ మీద పడదని నమ్ముతారు. అదే కాదు నలుపు రంగు వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది.
వాస్తు ప్రకారం ఎదుటివారి దిష్టి తగలకుండా కాళ్ళకి లేదా చేతులకి నలుపు రంగు దారం కట్టిస్తారు. దుష్ట శక్తులు పారద్రోలడానికి నలుపు రంగు ఉపయోగిస్తారు. చెడు ప్రభావాలు మన మద పడకుండా ఉండేందుకు నలుపు రంగు చక్కగా ఉపయోగపడుతుంది. నలుపు రంగు వస్తువులు ఏవైనా ఇంట్లో పెట్టాలని అనుకుంటే ఉత్తర దిశ మంచిది. సంపద మార్గాలు పెంచుతుంది. ఉత్తర దిశ కుబేర దేవుడి దిక్కుగా పరిగణిస్తారు. ఉత్తర దిశలో నలుపు రంగు వస్తువులు ఉంటే చెడు ప్రభావం పడకుండా ఉంటుంది.