వరలక్ష్మీ వ్రతం చేస్తూ ఈ శ్లోకాలు చదవండి.. అమ్మ ప్రసన్నమవుతుంది..
వరలక్ష్మీ వ్రతం చేస్తూ ఈ శ్లోకాలు చదవండి. అమ్మ వారి అనుగ్రహం లభిస్తుంది.
భక్తితో వేడుకుంటే చాలు వరాలందిస్తుంది వరలక్ష్మీ దేవి. అందుకే స్త్రీలు భక్తి, శ్రద్ధలతో శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతం ఎంతో మంగళకరమైనది. అయితే ఈ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి? వ్రతంలో ఎన్ని పూజలు చేయాలి? ఎలా చేయాలి? అసలైన వ్రత విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఆ రోజున వీలుకాకుంటే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడానికి భక్తి ఉంటే చాలు. భక్తి, శ్రద్ధలతో ఈ వ్రతం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు.. ధ్యాన సంపద, పశు, గుణ, జ్ఞాన సంపద వంటి మొదలైనవి ఎన్నో ఉన్నాయి.
ఈ పవిత్రమైన వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూజా సామాగ్రిని సిద్ధం చేసుకుని.. పసుపుతో గణపతిని సిద్ధం చేసుకోవాలి. అనంతరం కంకణం తయారు చేసుకుని పూజకు సిద్ధమవ్వాలి. ఏ పూజనైనా గణపతి పూజతో ప్రారంభిస్తే మంచిది. వరలక్ష్మీ వ్రతమాచరించే ముందు కూడా గణపతి పూజ చేయాలి.
గణపతి పూజ
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహోణ సుముఖ, నమస్తే గణనాయక
అనే శ్లోకాన్ని చదివి.. గణపతిపై అక్షతలు చల్లాలి. అనంతరం..
యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజ కర్ణకాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్న రాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమ కేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్ర తుండాయ నమః
ఓం శూర్ప కర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కంద పూర్వజాయ నమః
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
షోడశోపచార పూజకు సంబంధించిన శ్లోకాన్ని చదివిన తర్వాత "నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి" అంటూ స్వామిపై పుష్పాలు వేయాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్లు గానీ.. బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.
అనంతరం..
ఓం భూర్భవస్సువః తత్సవితుర్వర్యేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ !!
నీటిని నివేదన చుట్టూ జల్లుతూ..
సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి..
ఓం ప్రాణయ స్వాహా
ఓం ఆపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా
ఓం బ్రహ్మేణ్యే స్వాహా
గుడ సహితఫల నివేదనం సమర్పయామి
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.. అంటూ నీటిని వదలాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
తాంబూలం సమర్పయామి,
తాంబూలానంతరం అచమనం సమర్పయామి..
అంటూ కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
కర్పూరం నీరాజనం సమర్పయామి
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామీ
అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః
శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు!
మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు
వినాయకునికి నమస్కరించి.. పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగా మహాగణపతి పూజను ముగించి.. అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.
కలశ పూజ
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః
అంగై శ్చ సాహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు శ్రీ మహా గణాధిపతి పూజార్థం దురితక్షయ కారకాః
అంటూ శ్లోకాన్ని చదివి.. కలశంలోని నీటిని పుష్పంతో ముంచి.. భగవంతుడిపైన పూజద్రవ్యాలపైన, పూజ చేస్తున్నవారి తలపైన చల్లుకోవాలి.
అధాంగపూజ
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.
చంచలాయై నమః పాదౌ పూజయామి
చపలాయై నమః జానునీ పూజయామి
పీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామి
కమలవాసిన్యై నమః కటిం పూజయామి
పద్మాలయాయై నమః నాభిం పూజయామి
మదనమాత్రే నమః స్తనౌ పుజయామి
కంబ్కంఠ్యై నమః కంఠం పూజయామి
సుముఖాయై నమః ముఖం పూజయామి
సునేత్రాయై నమః నెత్రే పూజయామి
రమాయై నమః కర్ణౌ పూజయామి
కమలాలయాయై నమః శిరః పూజయామి
శ్రీ వరలక్ష్మై నమః సర్వాణ్యంగాని పూజయామి
ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి.
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః
ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
కంకణ పూజ
కంకణాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షింతలతో ఈ విధంగా పూజ చేయాలి.
కమలాయైనమః ప్రథమగ్రంథిం పూజయామి
రమాయైనమః ద్వితీయ గ్రంథిం పూజయామి
లోకమాత్రేనమః తృతీయ గ్రంథిం పూజయామి
విశ్వజనన్యైనమః చతుర్థ గ్రంథిం పూజయామి
మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి
క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి
చంద్రసోదర్యైనమః అష్టమ గ్రంథిం పూజయామి
శ్రీ వరలక్ష్మీయై నమః నవమ గ్రంథిం పూజయామి
అనంతరం.. ఈ శ్లోకం చదువుతూ కంకణం కట్టుకోవాలి..
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే.
ఇలా పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం కచ్చితంగా మీ మీద ఉంటుంది. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రతతో పూజిస్తే లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి.