సెప్టెంబర్ 24, నేటి రాశి ఫలాలు- ఎవరో చేసిన తప్పు మీ తలకి చుట్టుకుంటుంది జాగ్రత్త-today september 24th tuesday rasi phalalu check zodiac wise results for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సెప్టెంబర్ 24, నేటి రాశి ఫలాలు- ఎవరో చేసిన తప్పు మీ తలకి చుట్టుకుంటుంది జాగ్రత్త

సెప్టెంబర్ 24, నేటి రాశి ఫలాలు- ఎవరో చేసిన తప్పు మీ తలకి చుట్టుకుంటుంది జాగ్రత్త

HT Telugu Desk HT Telugu
Sep 24, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ24.09.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబర్ 24 నేటి రాశి ఫలాలు
సెప్టెంబర్ 24 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 24.09.2024

వారం: మంగ‌ళ‌వారం, తిథి: స‌ప్త‌మి,

నక్షత్రం: మృగశిర, మాసం: భాద్ర‌ప‌ద‌ము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయనం

మేషం

విలువైన వస్తువులు, ఆభరణాలు, నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కొన్ని పాత వస్తువులను మారుస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు, బంగారం వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. జిల్లేడు వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. మాన‌సిక ప్రశాంత‌త కోసం దైవ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనండి.

వృషభం

దూర ప్రాంత ప్రయాణాలు కలసి వస్తాయి. వాహనాలు అమ్మకాలు కొనుగోలు విషయంలో అనుకూలంగా ఉంటుంది. ట్రావెల్స్ వారికి కాలం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి లాభదాయకం. దైవ చింతన కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. గురువుల సమక్షంలో కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

మిథునం

రాత్రింబవళ్లు కష్టపడి ఒక ప్రాజెక్టుని సమయానికి నిలబెడతారు. ప్రయోజనాలు దక్కించుకుంటారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సిద్ధ గంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. అయినవాళ్లతో సంబంధం వెతుక్కోవాలన్న ఆలోచనలు అంతగా ఉపయోగపడకపోవచ్చు. శుభవార్తలు వింటారు.

కర్కాటకం

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి కార్యాలయంలో ఎవరో చేసిన తప్పు మీ తలకి చుట్టుకోవడం బాధాకరమైన అంశంగా మారుతుంది. జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు గమనిస్తారు. మీకు అండగా నిలబడే వారిని మీ వైపుకి తిప్పుకుంటారు. సౌర కంకణాన్ని ధరించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాక్ష్యాధారాలతో సహా అసత్య ప్రచారాలు, నిందలను రూపుమాపుకుంటారు.

సింహం

ప్రేమ వివాహం పట్ల మీకున్న అభిప్రాయం ఇంట్లో ఉన్నవారు ఏకీభవించకపోవచ్చు. కొన్ని సందర్భాలలో వాళ్లను ఒప్పించలేక మీరు బాధ పడటం, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి పరిస్థితులు సంభవిస్తాయి. ప్రతిరోజూ దేవి దేవతలకు ప్రథమ తాంబూలం సమర్పించండి. జీవిత భాగస్వామి అలవాట్ల పట్ల ఆందోళన చెందుతారు. కొత్త రుణాలు చేస్తారు.

క‌న్య‌

ట్రావెల్స్ వ్యాపారస్తులకు కాలం అనకూలంగా ఉంటుంది. నూతనగృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ప్రింట్ మీడియాలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. కళాకారులకు, రచయితలకు బాగుంటుంది. క్రీడా రంగంలో వున్నవారికి అనుకూలం. విదేశాలకు వెళ్లి కొన్ని ప్రతిష్టాత్మకమైన పోటీలలో పాల్గొంటారు, విజయం సాధిస్తారు.

తుల

కోర్టు వ్యవహారాలు, తీర్పులు వాయిదా పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆహార నియమాలు కచ్చితంగా పాటించండి. టైఫాయిడ్, డయేరియా సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామికి విలువైన ఆభరణాలు బహుమతిగా ఇస్తారు. సౌర కంకణం ధరించండి. స్త్రీ సంతానం పట్ల శ్రద్ధ కనబరుస్తారు. వాళ్ల భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనలు ఉంటాయి. స్వగృహం/ప్లాట్లు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం

మానసిక సంతోషం కలిగి ఉంటారు. సంతాన సంబంధమైన మంచి విషయాలను తెలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. విదేశీ ద్రవ్యం చేతికి అందుతుంది. అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. నూతన పెట్టుబడులు లాభదాయకం. సినిమా రంగంలో ప్రవేశించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. సంగీతం పట్ల మక్కువ కనబరుస్తారు.

ధనుస్సు

సాంకేతిక విద్య, బిజినెస్ మేనేజ్మెంట్ నేర్చుకోవాల‌న్న ఆలోచనలు ముడి పడతాయి. ఆర్థిక స్థోమత లేనివారికి ప్రభుత్వం ఆసరాగా నిలబడుతుంది. అనుకున్న ఉన్నత చదువులను చదువుకోగలుగుతారు. గోమతీ చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు పునః ప్రారంభిస్తారు.

మకరం

మెకానిక్లు, టైలరింగ్ వారికి కాలం అనుకూలం. వస్త్ర వ్యాపారులకి బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరింపచేయడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గోడౌన్, షాపుని లీజు తీసుకోవాలన్న ఆలోచనలు ఉపకరిస్తాయి. ఓం నమశ్శివాయ వత్తులు, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. పెద్ద సంస్థలతో పరిచయాలు, సత్సంబంధాలు కలిగి ఉంటారు. నూతన వ్యాపార ఉత్పత్తులను తయారు చేస్తారు.

కుంభం

సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు. ఏదో ఒక విధంగా ఆకర్షణగా ఉంటేనే ఉద్యోగం స్థిరంగా ఉంటుందని అనుకుంటారు. స్నేహితుల ద్వారా ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. మానసిక ధైర్యం, సంతోషం తిరిగి సంపాదించుకుంటారు. పెద్ద మనుషుల సలహాలు, సూచనలు మేరకు చేసే ఆలోచనలు ముఖ్యమైన మార్పులకు కారణమవుతాయి.

మీనం

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి కొంతమందితో ఎన్ని అభిప్రాయ భేదాలున్నప్పటికీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా కలిసి వుంటారు. మీకు ఏమాత్రం సంబంధం లేని విషయాలలో మీ పేరుని ప్రస్తావిస్తారు. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలరు ధరించండి. శత్రువర్గంతో సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాలలో వీళ్లని శాశ్వతంగా వదిలించుకోవాలన్న ఆలోచనలు వస్తాయి. ఇలాంటి వాళ్ల గురించి సమయం వృధా చేసుకోకండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ