Venus transit: శుక్రుడి సంచారం.. వీరి కలలు సాకారం అవుతాయి, ప్రేమ వివాహం చేసుకుంటారు
Venus transit: నేటి నుంచి శుక్రుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఫలితంగా కొన్ని రాశుల వారి కలలు నెరవేరబోతున్నాయి. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకారం లభిస్తుంది. పండగ వాతావరణం నెలకొంటుంది.
Venus transit: అందం, ఆకర్షణ, ఆరోగ్యం, ప్రేమ, కళ, ఆనందం, అలంకరణ వంటి వాటికి ప్రతీకగా శుక్రుడిని భావిస్తారు. జూన్ 12వ తేదీ శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిని వీడి మిథున రాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశికి బుధుడు అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. మిథున రాశిలో శుక్రుడు తన పూర్తి స్వభావాన్ని చూపగలుగుతాడు.
జులై 6వ తేదీ వరకు శుక్రుడు మిథున రాశిలోనే ప్రయాణిస్తాడు. ఆ తర్వాత సింహ రాశిలోకి అడుగుపెడతాడు. జాతకంలో బలమైన శుక్రుడు ఉన్న వ్యక్తి అనేక అద్భుతమైన ఫలితాలను అనుభవిస్తాడు. భౌతిక సుఖాలు లభిస్తాయి. శుక్రుడి రాశిచక్రం మార్పు మొత్తం 12 రాశులను ప్రభావితం చేసినప్పటికీ, ఐదు రాశులు ఈ సమయంలో చాలా అదృష్ట ఫలితాలను చూస్తాయి.
మిథున రాశి
మిథున రాశికి ఐదు, పన్నెండవ గృహాలకు అధిపతి. శుక్రుడు మీ రాశి మొదటి ఇంట్లో సంచరిస్తాడు. ఈ సమయం వీరికి అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు విలాసాలు పొందుతారు. వృత్తిలో మీ గౌరవం పెరుగుతుంది. అధికారులు మీరు చేసే పనికి విలువ ఇస్తారు. మీ శ్రద్ధ, కృషిని చూసి అధికారులు వేతన పెంపు లేదా ప్రమోషన్ కు ప్రపోజ్ చేస్తారు. వ్యాపారం చేస్తున్న వాళ్ళు గణనీయమైన ఆదాయాన్ని పొందుతారు. తెలివిగల వ్యాపారవేత్తగా మీ కీర్తిని విజయవంతంగా అభివృద్ధి చేసుకుంటారు. గతంలో చేసిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి రాబడి ఇవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వారసత్వంగా ఆస్తి పొందే అవకాశం కూడా ఉంది.
సింహ రాశి
సింహ రాశి మూడు, పదో గృహాలకు శుక్రుడు అధిపతి. పదకొండో ఇంట్లో సంచరిస్తాడు. శుక్రుడి సంచారం వల్ల మీరు చేస్తున్న ప్రయత్నాలకు మంచి ఫలితాలు చేకూరతాయి. కెరీర్ పరంగా ఉద్యోగాలు మార్చడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఈ సమయం సద్వినియోగంగా ఉంటుంది. మంచి ఉద్యోగ ఆఫర్లు పొందుతారు. ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందుకుంటారు. కొత్త కంపెనీ ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం విజయాన్ని ఇస్తుంది. సొంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వాళ్ళు మంచి డబ్బు సంపాదించబోతున్నారు. జీవిత భాగస్వామితో సానుకూలంగా ఉంటారు.
కన్యా రాశి
కన్యా రాశి రెండు, తొమ్మిదో గ్రహాలకు అధిపతి. ఇప్పుడు శుక్రుడు పదో ఇంట్లో ఉంటాడు. ఈ సంచారం ఆర్థిక ప్రయోజనాలు, అదృష్టాన్ని పొందటంలో సహాయపడుతుంది. కెరీర్ అభివృద్ధి చేయడానికి ఇది మంచి అవకాశం. పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఈ సమయంలో ఆచరించడం వల్ల సానుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారపరంగా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగులకు జీతభత్యాలు, ప్రోత్సాహకాలు ఉంటాయి. డబ్బును కూడబెట్టుకోగలుగుతారు. ప్రేమ సంబంధాలు చిగురిస్తాయి. డబ్బుకు సంబంధించి ఆనందం కోసం కొద్దిగా ఖర్చు చేస్తారు.
ధనుస్సు రాశి
శుక్రుడు ఆరు, పదకొండవ గృహాలకు అధిపతి. ప్రస్తుతం మిథున రాశిలో సంచరించడం వల్ల ధనుస్సు రాశి జాతకులు ఎక్కువ లాబభయం పొందుతారు. అన్ని కోణాలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. కెరీర్ లో మార్పుకు ఇది ఉత్తమ సమయం. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి పరంగా విదేశాలలో పెట్టుబడి పెడితే ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమికుల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం తొలగిపోయి కలిసిపోతారు. వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంది.