డిసెంబరు 15, 2023: నేటి రాశి ఫలాలు.. వీరు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 15.12.2023 శుక్రవారం కోసం బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 15.12.2023
వారం: శుక్రవారం, తిధి: తదియ,
నక్షత్రం: పూర్వాషాఢ, మాసం: మార్గశిరం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేషరాశి
మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. స్త్రీలతో అభిప్రాయ భేదాలు రాకుండా వ్యవహరించాలి. కమ్యూనికేషన్ బాగుంటుంది. దూర ప్రదేశాల నుండి అందే కొన్ని విషయాలు మీకు ఆలోచన కలిగిస్తాయి. ప్రయాణాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. శారీరక శ్రద్ధ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. సమావేశంలో మీ గుర్తింపు పెరుగుతుంది. భాగస్వామి సహకారం ఉంటుంది. రుణాలు చెల్లిస్తారు. పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. మీ వృత్తిలో కొంత అభివృద్ధి ఉంటుంది. అధిక శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్నది సాధిస్తారు. ఆశించిన గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు సైంటిఫిక్‌గా కొత్త ఆలోచనలు చేస్తారు. వారు ఎంచుకున్న రంగాల్లో నూతన అవకాశాలు. కళారంగంలో వారికి రాణింపు శ్రమకు తగిన విలువ వస్తుంది. కుటుంబ సభ్యులలో ఒకరికి వృత్తిపరంగా నూతన అవకాశములు. సివిల్ ఇంజనీర్లకు కొంత అనుకూలం. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. భూమి, నూతన గృహాలు కొనుగోలు విషయంలో సంతృప్తినిస్తాయి. రావలసిన రుణములు అందుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక సేవ చేస్తారు. వ్యక్తులు తమ రంగాలలో పోటీలలో నెగ్గేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. విదేశీ వృత్తికి అవకాశాలు. దూర ప్రదేశాలలో విద్య కొరకు విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. అధికారుల మెప్పు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. స్థానచలనానికి కొంత అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు ఉండును. ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన మానసిక ఆనందాన్నిస్తుంది. ముఖ్యమైన ఆత్మీయులను సహకరించడానికి సమయానికి కొంత ధనాన్ని వెచ్చిస్తారు. సంతానానికి విద్యాపరంగా ఖర్చులుంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు. పెట్టుబడులు పెట్టుట కొరకై ఆలోచనలు చేస్తారు. కమ్యూనికేషన్ బాగుంటుంది. పరాక్రమం పెరుగుతుంది. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా లేని ఆకస్మిక ఖర్చులు, చికాకులు ఆందోళన కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో, ముఖ్య ప్రయాణాలు, నిర్ణయాలు కొంత వాయిదా మంచిది. ఇతరులతో గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ సలహాల కొరకు ఇతరులు మిమ్మల్ని సంప్రదిస్తారు. వృత్తిపరంగా భాగస్వామితో కలసి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో జరగవలసిన కార్యాల కోసం తండ్రితో దీర్ఘచర్చలు చేస్తారు. మీ మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కన్యారాశి
కన్యారాశి వారికి నేటి రాశి ఫలాలు అనుకూలంగా లేవు. ముఖ్య పనుల్లో కొంత ఆటంకాలు విసుగునిస్తాయి. ఆహార, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. భూమికి సంబంధించిన అంశాలలో కొన్ని చికాకులు, ముఖ్య పనులలో ఆలస్యం అయినా ఓర్పుగా ఎదుర్కొని ముందుకు వెడతారు. శ్రమతో పనులు సాధిస్తారు. సంఘంలో గుర్తింపు పెరుగుతుంది. మీ శ్రమకు తగిన రివార్డులు. కుటుంబంలో వ్యక్తుల మధ్య అనుకూలత వాతావరణం బాగుంటుంది. భాగస్వామికి వృత్తిపరంగా గౌరవం, గుర్తింపు. దూరప్రదేశాల నుండి ఆహ్వానాన్ని అందుకుంటారు. సంతాన అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు చేస్తార. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. శుభఫలితాలు కలుగుతాయి.
తులా రాశి
తులారాశి వారికి నేటి దినఫలాలు అనుకూలంగా లేవు. నూతన వ్యక్తుల కొరకు ఆకస్మిక ఖర్చులు ఇబ్బంది పెట్టును. దీర్హకాలిక పెట్టుబడులకై కుటుంబములో స్త్రీలతో కలసి ఆలోచిస్తారు. వాహన, గృహ సంబంధపరమైన చర్చలు ముందుకు వెడతాయి. ఆరోగ్యముపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వృత్తిపరమైన భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రాకుండా చేసుకోవాలి. గృహ అవసరమైన కొనుగోలు మొదలైన వాటి కోసం ఆలోచనలు చేస్తారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. నిరుద్యోగులకు వృత్తిలో కొత్త అవకాశాలు. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ గట్టిగా కృషి చేసి ముందుకు వెళతారు. కుటుంబ కార్యాలలో పాల్గొంటారు. అధికారంలో ఉండే స్త్రీలు సహకరిస్తారు. దూరప్రదేశాల్లో నూతన ఉపాధి అవకాశం. ఆత్మీయులు సహకరిస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి కరంగా ఉంటుంది. బంధువర్గాన్ని కలుస్తారు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. శుభఫలితాలు కలుగుతాయి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తిపరంగా శ్రమ, అధిక బాధ్యతలు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులను నమ్మి మోసపోవద్దు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో ప్రత్యే శ్రద్ధ వహించాలి. సంతానానికి విదేశీ అవకాశాలు. ప్రయాణాలలో పరిచయం లేని వ్యక్తులతో ఇబ్బంది కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించండి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. కొత్త వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. తోబుట్టువులతో సమావేశాలు చర్చలుచేస్తారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటారు. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ అవసరం. వృత్తిలో విదేశీ ఆదాయాన్ని పొందేందుకు అవకాశముంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీస్తోత్రం పఠించండి.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రముఖులతో పరిచయాలేర్చడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పెట్టుబడులు కలసిరావు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. గృహమార్చు అనివార్యం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. శుభఫలితాలు కలుగుతాయి.
-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000