మార్చి 31, నేటి రాశి ఫలాలు..ఈ రాశుల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు చేజారిపోతాయి-today horoscope march 31st rasi phalalu in telugu check your zodiac signs result for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మార్చి 31, నేటి రాశి ఫలాలు..ఈ రాశుల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు చేజారిపోతాయి

మార్చి 31, నేటి రాశి ఫలాలు..ఈ రాశుల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు చేజారిపోతాయి

HT Telugu Desk HT Telugu
Mar 31, 2024 12:05 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ31.03.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 31వ తేదీ నేటి రాశి ఫలాలు
మార్చి 31వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 31.03.2024

వారం: ఆదివారం, తిథి : షష్టి

నక్షత్రం : జ్యేష్ట మాసం : ఫాల్గుణం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేషరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబసభ్యులతో ఆనందముగా గడిపెదరు. బంధుమిత్రులతో అభిప్రాయభేదాలు ఏర్పడు సూచనలున్నాయి. వృత్తి వ్యాపారపరంగా నూతన కాంట్రాక్టులు, ఒప్పందాలు చేసుకోగలరు. ఆరోగ్యం అనుకూలించును. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఉద్యోగస్తులకు మానసిక ఆందోళన, పని ఒత్తిళ్ళు ఉంటాయి. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారం వంటివి చేయటం వలన శుభఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. నూతన వ్యక్తుల పరిచయాలుంటాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వివాహ నిశ్చయాలకు చేయు ప్రయత్నాల్లో అచితూచి వ్యవహరించాలి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. ప్రయాణాలు కలసివస్తాయి. వృషభరాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి. నవగ్రహ జపం చేయటం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికి బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. రుణదాతలనుండి ఒత్తిళ్ళు ఉంటాయి. ఇన్యూరెన్స్‌లను పొందగలుగుతారు. అద్దె ఇంటి మార్పులు, వాహన మార్పులేర్పడగలవు. నిర్మాణపు పనుల్లో అనుభవజ్ఞుల సలహాలు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అరుణం పారాయణం చేయడం మంచిది. సూర్యభగవానుడికి తర్పణాలు వదలండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా వేస్తారు. నిరుద్యోగులకు అనుకూలంగా లేదు. కొత్తగా అప్పులు చేస్తారు. వ్యాపారస్తులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులుంటాయి. అనారోగ్య సమస్యలు. కార్యక్రమాలలో అవరోధాలుంటాయి. అధిక ప్రయాణాలుంటాయి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్యనారాయణమూర్తిని పూజించండి. చంద్రశేఖరాష్టకం పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీరు చేసే పనులను వాయిదా వేయవద్దు. శక్తివంచన లేకుండా కృషి చేయండి. మొహమాటంతో రుణసమస్యలు పెంచుకోవద్దు. ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. సింహ రాశి వారికి మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండాలి. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు పడతారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలించవు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు చేజారతాయి. ఆస్తి విషయాలలో గొడవలు. దూరప్రయాణాలుంటాయి. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. చేపట్టిన పనులలో ఆటంకాలు. కుటుంబ బాధ్యతలు ఇబ్బందిపెట్టును. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యభగవానుని పూజించి బెల్లం, పరమాన్నాన్ని నివేదించడం మంచిది. ఆలయాలను దర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మానసికంగా అరోగ్యంగాను, ఉత్సాహంగా ఉంటారు. వాహన, అద్దె ఇంటి మార్పులుంటాయి. సంతానపరంగా ఎక్కువ సమయం కేటాయించవలసి రావచ్చు. తెలియని వారితో జాగ్రత్తగా ఉండండి. పాత వ్యక్తులతో సంబంధాలకై కావలసిన ఏర్పాట్లు చేసుకోగలుగుతారు. మీ సామర్థ్యంపై నమ్మకం పెరుగుతుంది. అవకాశాలు కలసివస్తాయి. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. సూర్య నమస్కారాలు చేయాలి.

వృశ్చిక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీ సమర్ధతకు తగిన గుర్తింపు కోసం ప్రయత్నించాలి. ఓర్పు, సహనంతో వ్యవహరించాలి. ఆప్తులు, స్నేహితులు వంటివారితో కలసిమెలసి ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలించును. ఆరోగ్యవిషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేస్తారు. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానపరంగా శుభములేర్పడగలవు. ఆరోగ్యపరంగా మంచి మార్పులు చూస్తారు. సమయం సద్వినియోగ పరచుకోవాలి. రావలసిన ధనం చేతికందుతుంది. ఊహించుకున్నవి చేసుకోగలుగుతారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ధనూరాశివారు మరింత శభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగులకు అధికారిక హోదాలుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలుంటాయి. ప్రయాణాల్లోను, వాహనాలతోను జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికమగును. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహశాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. ఆరోగ్య ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఉద్యోగమార్పులు కోరుకొను వారికి ప్రయోజనాలుంటాయి. చేపట్టే పనుల్లో విజయం పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. కుంభరాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. వృత్తి ఉద్యోగ మార్పులకు దూరంగా ఉంటూ మీ ప్రయత్నాలను వేగవంతం చేసుకోవాలి. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner