Stubborn zodiac signs: ఈ రాశుల వారికి మొండితనం కాస్త ఎక్కువే.. ఎవరి మాట వినరు-these zodiac signs people stubborn behaviour and independent nature ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Stubborn Zodiac Signs: ఈ రాశుల వారికి మొండితనం కాస్త ఎక్కువే.. ఎవరి మాట వినరు

Stubborn zodiac signs: ఈ రాశుల వారికి మొండితనం కాస్త ఎక్కువే.. ఎవరి మాట వినరు

Gunti Soundarya HT Telugu
Jun 03, 2024 01:33 PM IST

Stubborn zodiac signs: ఒక వ్యక్తి స్వభావం రాశి చక్రాలను ఆధారంగా కూడా చెప్తారు. అలా కొన్ని రాశుల వారికి మొండితనం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎవరి మాట వినరు. తమదే కరెక్ట్ అని మొండిగా వాదిస్తారు.

ఈ రాశుల వారికి మొండితనం ఎక్కువే
ఈ రాశుల వారికి మొండితనం ఎక్కువే (pexels)

Stubborn zodiac signs: వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి అలవాట్లు, స్వభావం, వ్యక్తిత్వం, భవిష్యత్ ని రాశి చక్రం ద్వారా అంచనా వేస్తారు. ప్రతి రాశి చక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది. దీని కారణంగా ప్రతి వ్యక్తిలో విభిన్న లక్షణాలు కనిపిస్తాయి. ఏ ఇద్దరూ కూడా ఒకే మనస్తత్వం కలిగి ఉండటం చాలా కష్టం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల జాతకులు తెలివిగా ఉంటారు. అలాగే ఏ పనైనా తమ ఇష్టానుసారం మాత్రమే చేసేందుకు ఇష్టపడతారు. స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. ఇతరులు చెప్పిన దానికి ఏ మాత్రం రాజీ పడరు.

కొంతమంది తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టుగా మాట్లాడతారు. ఏదైనా కావాలని కోరుకుంటే మొండిగా ప్రవర్తిస్తారు. తాము అనుకున్నది జరగాలని పట్టుబడతారు. అలాంటి వ్యక్తులతో వేగడం కాస్త కష్టమే. కొన్ని సార్లు వారి మొండివైఖరి విసుగు, చిరాకు తెప్పిస్తాయి. మరి మీ స్నేహితులు, సన్నిహితుల్లో ఎవరు అలాంటి స్వభావం ఉన్న వాళ్లో తెలుసుకోండి. మరి ఆ రాశులు ఏవో చూసేయండి.

మేష రాశి

మేష రాశి జాతకులు స్వతంత్ర భావాలు కలిగినవారు. కఠోర శ్రమ, అంకిత భావంతో ప్రతి పనిలో గొప్ప విజయం సాధిస్తారు. సవాళ్ళకు అసలు భయపడరు. వీరిలో నాయకత్వ లక్షణాలు చాలా బాగుంటాయి. కష్టకాలంలోనూ వెనుకడుగు వేయారు. వీరు జీవితంలో మూడో వ్యక్తి జోక్యాన్ని అసలు సహించలేరు. వారి సొంత నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటారు. స్వభావరీత్యా కొంచెం మొండిగా ఉంటారు. దీని వల్ల అనేక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అభిప్రాయాలను ఇతరులు కూడా గౌరవించాలని అనుకుంటారు. వీరి ఆలోచనలు ఇతరులపై బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తారు. కొన్ని సార్లు ఆ ప్రవర్తన ఇతరులను ఇబ్బంది పెడుతుంది. చుట్టుపక్కల వారిని గౌరవిస్తూ వారితో కలిసి ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. అప్పుడే వీరికి ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటారు. కానీ ఇతరులకు అనుగుణంగా ఏ పని చేయడానికి ఇష్టపడరు. తరచుగా ఆధిపత్య స్వభావం చూపిస్తారు. అదే వీరిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. అహంకారంగా ప్రవర్తిస్తారు. ఇతరులను గౌరవించాలి. వారి చర్యలను ప్రశంసించాలి. తప్పులను ప్రోత్సహించకుండా వారిని సరిచేస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రయత్నించే వ్యక్తులతో ఉండాలి. అప్పుడే మీకు నిజమైన ప్రశంసలు దక్కుతాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వాళ్ళు ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. శక్తి, ఉత్సాహంతో నిండి ఉంటారు. తమ ఇష్టానుసారం ప్రవర్తించేందుకు మొగ్గు చూపుతారు. యజమానులు, ఇతరులకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడరు. జీవితంలో మూడో వ్యక్తి జోక్యం వీరికి అసలు నచ్చదు. అలాగే తమ భావోద్వేగాలను, రహస్యాలను ఎవరితోనూ పంచుకోరు. ఇతరులతో ఏర్పడిన సంబంధంలో ఆధిపత్య స్వభావాన్ని కలిగి ఉంటారు. దీని వల్ల ప్రేమ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అర్థం పర్థం లేని చర్చలకు దూరంగా ఉండాలి. అప్పుడే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. జీవితం సజావుగా సాగిపోతుంది.

 

Whats_app_banner