Mars transit: కుజుడు సంచారంతో ఈ ఐదు రాశుల వాళ్ళు ధనవంతులు అవుతారు
Mars transit: అంగారక గ్రహం ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తే మరికొన్ని రాశుల వారికి కష్టాలు ఎదురుకాబోతున్నాయి.
Mars transit: అన్ని గ్రహాలకి అధిపతి అంగారకుడు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది. డిసెంబర్ 27న కుజుడు వృశ్చిక రాశి నుంచి ధనస్సులోకి ప్రవేశించాడు. అంగారకుడు శక్తి, ధైర్యం, పరాక్రమం, శౌర్యం వంటి వాటికి కారకుడిగా చెప్తారు. కుజుడు మేషం, వృశ్చిక రాశికి చెందిన వాడు. మకర రాశిలో ఎక్కువగా ఉంటుంది.
కుజుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి అదృష్టం వరించబోతుంది. అలాగే కొన్ని రాశుల వాళ్ళు సమస్యలు ఎదుర్కోబోతున్నారు. అంగారకుడు శుభ ప్రదంగా ఉండటం వల్ల ఒక వ్యక్తి జీవితంలో సంతోషకరమైన సమయం పొందుతారు. కుజుడు తన రాశి చక్రాన్ని మార్చుకోవడం వల్ల 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..
మేష రాశి: మనసులో వచ్చే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆరోగ్య సమస్యల కారణంగా వైద్య ఖర్చులు పెరుగుతాయి. డబ్బు ఖర్చు పెట్టె విషయంలో జాగ్రత్తగా వహించాలి. ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది.
వృషభ రాశి: కుజుడు సంచారంతో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. ఓపికగా ఉండటం అవసరం. ఉద్యోగంలో అధికారులతో సఖ్యతగా పాటించడం మంచిది. ఉద్యోగ పరిధిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
మిథునం: మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. స్నేహితుల సహాయంతో వ్యాపారం మెరుగుపడుతుంది. లాభసాటి అవకాశాలు లభిస్తాయి.
మకర రాశి: ఆత్మవిశ్వాసం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగస్థులకి ప్రమోషన్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. జీవన పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉంటాయి. జీవితంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి.
సింహం: మనసు సంతోషంగా ఉంటుంది. దాంపత్య సుఖం పెరుగుతుంది. సంపదలో పెరుగుదల కనిపిస్తుంది. తండ్రి నుంచి ధనం అందుతుంది. తల్లి మద్దతు పొందుతారు.
కన్య: మనసు చంచలంగా ఉంటుంది. ఏదో తెలియని భయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పూర్వీకుల ఆస్తి మీకు లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు.
తులా రాశి: అంగారకుడు సంచారం వల్ల ఈ రాశి వారికి శుభం చేకూరుతుంది. మనసు సంతోషంగా ఉంటుంది. కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుల సాయంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది.
వృశ్చికం: ఈ రాశి కొన్ని రోజుల పాటు ఓపికగా ఉండటం మంచిది. మితిమీరిన కోపానికి పోవద్దు. వ్యామోహానికి దూరంగా ఉండడాలి. తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. వాహన సుఖం పెరుగుతుంది.
ధనస్సు: ఈ రాశి వారి మాటలు కాస్త కఠినంగా ఉంటాయి. సంయమనం పాటించాలి. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం మంచిది. తగాదాల జోలికి వెళ్లొద్దు. పాత మిత్రులని కలుసుకుంటారు.
మకరం: ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మనసులో ప్రతికూల ఆలోచనలు రానివ్వకుండా చూసుకోండి. స్నేహితుల సహాయంతో ఆదాయం పొందుతారు.
కుంభం: మనసు కలత చెందుతుంది. సంయమనం పాటించండి. మానసిక ప్రశాంతత కాపాడుకోవడానికి ప్రయత్నించండి. అకడమిక్ పనుల పట్ల జాగ్రత్త వహించండి. ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
మీనం: మనసు సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ స్నేహితుడు సహాయంతో మీరు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చు. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు.