Dasara 2024: దసరా రోజు పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి- నెగటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది-these 5 things should not be done even by mistake on the day of dasara 2024 life is filled with negativity ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dasara 2024: దసరా రోజు పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి- నెగటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది

Dasara 2024: దసరా రోజు పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి- నెగటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది

Gunti Soundarya HT Telugu
Oct 10, 2024 02:30 PM IST

Dasara 2024: అక్టోబర్ 12 దసరా పండుగ జరుపుకోనున్నారు. ఈ రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. అలా చేస్తే జీవితంలో నెగటివిటీ పెరిగిపోతుంది. ప్రశాంతకరమైన జీవితం సాగించలేరు. దసరా రోజు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం.

దసరా రోజు చేయకూడని తప్పులు ఇవే
దసరా రోజు చేయకూడని తప్పులు ఇవే (pixabay)

అధర్మంపై ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే దసరా. మరో రెండు రోజుల్లో దసరా పండుగ జరుపుకోనున్నారు.

ఈ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించి సత్యాన్ని స్థాపించాడు. నవరాత్రులలో దుర్గాదేవి ఆరాధన తర్వాత వెంటనే వచ్చే ఈ పండుగ అనేక విధాలుగా చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున వివిధ ఆచారాలు, శుభం కోసం ఇళ్లలో పూజలు చేస్తారు. అయితే దసరా రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ చర్యలు సాధారణ దృక్కోణం నుండి మాత్రమే కాకుండా మతపరమైన దృక్కోణం నుండి కూడా చెడుగా పరిగణిస్తారు. దసరా రోజున ఈ పనులన్నీ ఇంట్లోకి ప్రతికూలతను తెస్తాయని చెబుతారు. అవి ఏంటో తెలుసుకుందాం.

ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి

ఇది పండుగ సీజన్. అటువంటి పరిస్థితిలో ఇంటి పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది దీపావళికి శుభ్రం చేయడంలో బిజీగా ఉండవచ్చు. దాని కారణంగా వారు ఇంటి చుట్టూ సామాన్లు అవి పరిచి పెట్టేస్తారు. సెలవు రోజు కదా అని దసరా రోజున ఇల్లు దులుపుకోవడం వంటివి చేయకూడదు. పండుగకు ముందే ఇల్లు శుభ్రం చేసి పెట్టుకోవాలి. దసరా రోజున అలాంటి క్లీనింగ్ పనులు చేయకూడదని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇంటి మెయిన్ డోర్ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మతపరమైన దృక్కోణంలో కూడా దసరా నాడు పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయకపోతే ఇంట్లో ప్రతికూలత వస్తుంది.

పెద్దలను అవమానించడం

భారతీయ సంస్కృతిలో పెద్దలను గౌరవించడం సర్వోన్నతమైనది. పెద్దలను గౌరవించకుండ వారిని దూషించే వ్యక్తి చేసిన పని కూడా చెడిపోతుందని అంటారు. ముఖ్యంగా దసరా రోజున పెద్దవారితో అనుచితంగా ప్రవర్తించకూడదు. వారికి నచ్చినవి తీసుకురండి. వారికి తినడానికి మంచి ఆహారం వండి పెట్టండి. ఇవన్నీ చేయడం ద్వారా అతను సంతోషంగా ఉంటాడు. మీరు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తాడు.

చెట్లు, మొక్కలకు హాని చేయవద్దు

మన జీవితంలో చెట్లు, మొక్కల ప్రాముఖ్యత అందరికీ తెలుసు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి. దసరా నాడు చెట్లు, మొక్కలు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ రోజు పొరపాటున కూడా చెట్లకు, మొక్కలకు హాని చేయకూడదు. మీకు కావాలంటే మీరు ఈ రోజున మీ స్వంత చేతులతో ఒక చెట్టును నాటవచ్చు. మీరు ఇంట్లోకి ఒక మొక్కను కొనుగోలు చేయవచ్చు. ఈ పనులన్నీ చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.

తామసిక ఆహారాన్ని తినడం మానుకోండి

దసరా పండగ అంటే అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. అయితే చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే మతపరమైన పండుగ ఇది. అటువంటి పరిస్థితిలో వినోదం కోసం మద్యపానం, ధూమపానం లేదా మరేదైనా చెడు అలవాటులో మునిగిపోకండి. ఇది కాకుండా వీలైతే రోజంతా సాత్విక ఆహారం తీసుకోండి. ఈ రోజున మీరు అధిక నూనె, మసాలా దినుసులతో కూడిన ఆహారానికి దూరంగా ఉంటే మంచిది.

ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు

దసరా రోజున ప్రజల గురించి చెడుగా మాట్లాడటం మానుకోండి. ఈ అలవాటును దసరాకి మాత్రమే కాకుండా మీ జీవితంలో ఒక నియమంగా అనుసరించండి. దుర్భుద్ధితో ఇతరులకు చెడు చేయడం వల్ల ఇతరులకు ఏమీ నష్టం జరగదు కానీ మీకు మాత్రమే హాని జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ దసరాకి రావణ దహనంతో పాటు మీలో ఉన్న ఈ అలవాటును మీరు కాల్చేయండి. జీవితంలో సానుకూలతకు కొరత ఉండదు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

 

Whats_app_banner