Mahabharatam: మహా భారతం గురించి మీకు ఎంత వరకు తెలుసు? అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి
Mahabharatam: భారతీయ ఇతిహాసాలలో గొప్పది మహా భారతం. దీన్ని ఎన్ని సార్లు చదివినా ఏదో ఒక తెలియని విషయం తెలుస్తూనే ఉంటుంది. మీరు మహా భారతం చదివారా? అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీకు మహా భారతం ఎంత వరకు తెలుస్తుందో చూద్దాం.
Mahabharatam: తింటే గారెలే తినాలి.. వింటే మహాభారతం వినాలి అనే నానుడి అందరికీ తెలిసిందే. ఎంత చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపించే మహా గొప్ప కావ్యం మహా భారతం. హిందువులు పంచమ వేదంగా మహాభారతాన్ని పరిగణిస్తారు. వేద వ్యాసుడు చెప్తుండగా గణనాథుడు లిఖించాడని నమ్ముతారు.
మహా భారతం 18 పర్వములతో, లక్ష శ్లోకాలతో ప్రపంచంలోనే అతి పెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా పేరు గాంచింది. మన ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు మహాభారతాన్ని చదువుకుంటూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా ఇది చదవడం చాలా ముఖ్యం. ఇది కేవలం గ్రంథం మాత్రమే కాదు. ఒక మనిషి ఎలా జీవించాలి అనేది తెలియజేస్తుంది. జ్ఞానాన్ని బోధిస్తుంది. సత్య మార్గాన్వేషణ ఎలా చేయాలో వివరిస్తుంది. ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని అందులోని వ్యత్యాసాన్ని చెప్తుంది. మహా భారతం చదవడం వల్ల మనకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి.
మహాభారతం అనగానే ప్రాచీన భారతీయ ఇతిహాసం, కౌరవులు, పాండవులు, శ్రీకృష్ణుడు, కురుక్షేత్ర యుద్ధం అని అందరూ ఠక్కున చెప్పేస్తారు. నేటి తరాలకు జ్ఞానోదయం చేసే జ్ఞాన భాండాగారం. చిన్నప్పటి నుంచి మనం ఏదో ఒక సందర్భంలో మహా భారతంలోని కొన్ని విషయాల గురించి వింటూనే ఉంటాం. అయితే ఈ అద్భుతమైన కావ్యం గురించి మీలో ఎంత మందికి తెలుసు అనేది ఈ క్విజ్ ద్వారా చెప్పేయవచ్చు. మీకున్న జ్ఞానం ఎంతో మీరే పరీక్షించుకోండి. మహా భారతానికి సంబంధించిన కొన్ని సులభమైన ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. వాటిలో మీకు ఎన్ని సమాధానాలు తెలుసుకో చూసుకోండి.
- మహా భారతం అసలు పేరు ఏమిటి?
- ఒక్కసారి కూడా విరామం తీసుకోకుండా మహాభారతం మొత్తం పఠించిన వ్యక్తి ఎవరు?
- మహాభారత యుద్ధాన్ని ఏమని అంటారు?
- యుద్ధం ముగుసిన తర్వాత శ్రీకృష్ణుడిని ఎవరు శపించారు? ఆ శాపం ఏంటి?
- ధృతరాష్ట్రుడికి, గాంధారికి యుద్ధ ఘట్టాలను ఎవరు వివరించారు?
- వంద మంది కౌరవుల్లో ఏ సోదరుడు వీరి పక్షం వహించకుండ పాండవుల తరపున ఉన్నాడు?
- దేవతల నుంచి సంతానం పొందే వరం ఎవరు పొందారు? ఈ వరం నుంచి ఎవరు జన్మించారు?
- యుద్ధం ప్రారంభానికి ముందు ఊదబడిన శంఖం పేరు ఏంటి?
ఈ ప్రశ్నలకు మీకు సమాధానం తెలిస్తే మీకు మహాభారతం మీద కాస్త పట్టు ఉన్నట్టే అర్థం. ఒకవేళ మీకు సమాధానాలు తెలియలేదా అయితే ఇదిగో ఇక్కడ తెలుసుకోండి.
- మహాభారతం అసలు పేరు జయ
- విరామం లేకున మహాభారతాన్ని పూర్తిగా పఠించిన వ్యక్తి వేద వ్యాసుడు.
- మహాభారత యుద్ధం కురుక్షేత్ర యుద్ధం
- యుద్ధ భూమిలో కన్న బిడ్డలు నిర్జీవులుగా పడి ఉండటం చూసిన గాంధారి తన కడుపు తీపి వల్ల శ్రీకృష్ణుడిని శపించింది. అతని వంశం, యాదవుల్లో ఒకరితో ఒకరు పోరాడి అంతరించిపోతారని శాపం విధించింది.
- వ్యాస మహర్షి శిష్యుడైన సంజయుడు తన దివ్య నేత్రం ద్వారా కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన సంఘటనలు చూశాడు. అతనే ధృతరాష్ట్రుడు, గాంధారికి వివరించాడు.
- ధర్మ పక్షం నిలబడిన కౌరవుడు యుయుత్సుడు మాత్రమే. కౌరవులు అంతరించిన తర్వాత రాజ్యాన్ని పాలించాడు.
- కుంతి దేవికి ఏ దేవుడితోనైనా కొడుకు పుట్టగల వరం పొందింది. ఈ వరాన్ని దుర్వాస మహర్షి ఇచ్చాడు. అలా సూర్యుడి అనుగ్రహంతో కుంతి దేవికి పుట్టిన పుత్రుడే కర్ణుడు. కవచ కుండలాలతో జన్మించాడు.
- కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఊదిన శంఖం పేరు పాంచజన్య.