Saturn transit: నవంబర్ నుంచి ఈ రాశుల వారికి భారీ ఆర్థిక లాభం.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు-saturn direct transit in november these zodiac signs luck financial gains ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Transit: నవంబర్ నుంచి ఈ రాశుల వారికి భారీ ఆర్థిక లాభం.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

Saturn transit: నవంబర్ నుంచి ఈ రాశుల వారికి భారీ ఆర్థిక లాభం.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

Gunti Soundarya HT Telugu

Saturn transit: శని మరికొన్ని నెలల్లో ప్రత్యక్ష మార్గంలోకి పయనిస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి భారీగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.

శని ప్రత్యక్ష సంచారం

Saturn transit: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు ఒక వ్యక్తి పనుల ప్రకారం శుభ ఫలితాలను అందిస్తాడు. అందుకే న్యాయ దేవుడు అని పిలుస్తారు. శని పేరు చెప్తేనే చాలా మంది భయపడిపోతారు.

ఈ ఏడాది మొత్తం శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలోనే సంచరిస్తాడు. వచ్చే ఏడాది శని తన రాశిని మార్చుకుని మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. నవంబర్ 15 నుంచి ప్రత్యక్ష మార్గంలో ప్రయాణిస్తాడు. శని ప్రత్యక్షంగా మారినప్పుడు కొన్ని రాశుల జీవితాలు ప్రభావితం అవుతాయి. గొప్ప ప్రయోజనాలు అందుతాయి. జాతకంలో శని అనుగ్రహం ఉంటే వ్యక్తి అదృష్టం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అదే అశుభ స్థానంలో ఉంటే కష్టాలు పెరుగుతాయి. శని సంచారం వల్ల ఆర్థిక లాభాలు పొందే రాశులు ఏవో చూద్దాం.

మిథున రాశి

శని ప్రత్యక్ష మార్గంలో సంచరించడం వల్ల మిథున రాశి వారికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి. వివిధ పనులు విజయవంతంగా పూర్తి చేయడానికి అదృష్టం వీరి వైపే ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ మద్దతు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ కాలంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

సింహ రాశి

శని ప్రత్యక్ష సంచారం వల్ల సింహ రాశి వారికి భారీ ఆర్థిక లాభాలు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. కళ, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలో మార్పుకు అవకాశం ఉంది. ఉద్యోగులకు బదిలీ జరిగే సూచనలు ఉన్నాయి. పిల్లల నుంచి శుభవార్తలు పొందుతారు. ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది.

కన్యా రాశి

శని ప్రత్యక్ష సంచారం వల్ల కన్యా రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానం ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగం మారాలని ఆలోచన ఈ సమయంలో మంచి అవకాశాలు తీసుకొస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలోని పెద్దల నుంచి డబ్బు అందుతుంది.

తుల రాశి

తులా రాశి వారికి శని ప్రత్యక మార్గంలో సంచరించడం వల్ల మేలు జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. స్నేహితులు అండగా నిలుస్తారు.

ధనుస్సు రాశి

శని ప్రత్యక్ష సంచారం ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. డబ్బులు ఖర్చు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది అలాగే ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. ఈ కాలంలో ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.