Saturn Rahu Conjunction:శని,రాహువు కలయికతో పిశాచ యెగం- 2025 నూతన సంవత్సరంలో ఈ రాశుల వారికి చుక్కలే
Saturn Rahu Conjunction:2025 నూతన సంవత్సరంలో శని, రాహుల మధ్య సంయెగం జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని పిశాచ యోగం అంటారు. ఈ రెండు గ్రహాల కలయిక మీనరాశిలో జరుగుతుంది.అయితే ఈ గ్రహ సంయోగ కారణంగా కొన్ని రాశుల వారు ఇబ్బందులు పడతారు.
గ్రహాలన్నింటిలో శని, రాహువులను దుష్ట గ్రహాలుగా చెబుతారు. ఈ రెండు గ్రహాల కలిస్తే అది వినాశానికి కారణమవుతుంది. కనుక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని, రాహువుల కలయికను పిశాచ యోగంగా చెబుతారు. ఈ యోగం సవాళ్లు, అడ్డంకులను పెంచుతుంది. మానసిక ఆందోళన, భయం, నిరాశలకు కారణమవుతుంది. ప్రస్తుతం కుంభ రాశిలో ప్రత్యక్షంగా ఉన్న శని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 మార్చి 29న శనివారం రాత్రి 10:07 నిమిషాలకు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.రాహువు ఇప్పటికే మీన రాశిలో ఉన్నాడు. ఫలితంగా ఈ రెండు గ్రహాల సంయోగం జరుగుతుంది. దీని ప్రభావం మార్చి 29 2025 నుంచి అన్ని రాశుల వారిపై పడుతుంది. ముఖ్యంగా మూడు రాశులపై మాత్రం విపరీత ప్రభావాన్ని చూపిస్తుంది.
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ పిశాచ యెగం చాలా దురదృకరంగా ఉంటుంది. వృత్తి, వ్యక్తిగత విషయాల్లో ఒత్తిడి కలిగిస్తుంది. సంభాషణల్లో అపార్థాలు సంభవించవచ్చు. ఇంటా, బయటా వివాదాలకు అవకాశాలు ఎక్కువ.ఆర్థికంగా కూడా ఇబ్బందులు నెలకొంటాయి. ఉద్యోగం విషయంలో చివాట్లు తప్పవు. వ్యాపారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. భాగస్వామితో వైరుధ్యాలు కలుగుతాయి. మొత్తం శ్రేయస్సును, ఆనందాన్ని కోల్పోతారు. ఆంజనేయ స్వామిని పూజించడం, శనివారం హనుమంతుడికి వడమాల వేయడం వంటి పరిహారాల ద్వారా కాస్త ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి.
తులా రాశి:
శని రాహువుల కలయిక వల్ల తులా రాశి వారికి కూడా గడ్డు సమయాలు వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది కనిపించదు. అన్నింటా జాప్యం, అడ్డంకులు ఎదుర్కోక తప్పదు. స్నేహితులు, సన్నిహితు మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. జాగ్రత్తగా ఉండకపోతే విడిపోయేవరకూ వెళుతుంది. ఈ సమయంలో కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలి. తలనొప్పి, ఆందోళన, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలు కూడా తెలెత్తుతాయి. శనివారం రోజున నువ్వుల దీపంతో శని దేవుడిని ఆరాధించడం వల్ల పిశాచ యోగ ప్రభావాన్ని కాస్త తగ్గించుకోవచ్చు.
కుంభ రాశి:
శని రాహులవుల సంయోగం వల్ల కలిగే పిశాచ యోగ ప్రభావం కుంభ రాశి వారిలో మానసిక కల్లోలం సృష్టిస్తుంది. కుటుంబ, సామాజిక సంబంధాల్లో గందరగోళ పరిస్థితులను తెచ్చిపెడుతుంది. వృత్తి, వ్యక్తిగత జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్నతాధికారులు, సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండకపోతే ఉద్యోగం కోల్పేయే ప్రమాదం కూడా ఉంది. పెట్టుబడులు, వ్యాపారాల విషయంల్ో కూడా గట్టి ఎదురుదెబ్బలే తగులుతాయి. ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. శని వారంనాడు శనికి నువ్వుల నూనెతో అభిషేకం, ఆంజనేయుడికి వడమాల వేయడం వంటి పరిహారాలతో దీని ప్రభావాన్ని కాస్త తగ్గించుకోవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్