Sri rama navami 2024: శ్రీరామనవమి రోజు ఈ శ్లోకాలు పఠించారంటే మీ సకల బాధలు తొలగిపోతాయి-reciting these shlokas on the day of sri ramanavami will remove all your troubles ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజు ఈ శ్లోకాలు పఠించారంటే మీ సకల బాధలు తొలగిపోతాయి

Sri rama navami 2024: శ్రీరామనవమి రోజు ఈ శ్లోకాలు పఠించారంటే మీ సకల బాధలు తొలగిపోతాయి

Gunti Soundarya HT Telugu
Apr 16, 2024 05:51 PM IST

Sri rama navami 2024: శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి సంబంధించిన కొన్ని శ్లోకాలు పఠించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. సకల బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు.

శ్రీరామనవమి రోజు ఈ శ్లోకాలు పఠించండి
శ్రీరామనవమి రోజు ఈ శ్లోకాలు పఠించండి (unsplash)

Sri rama navami 2024: శ్రీరామనవమి రోజు కొన్ని శ్లోకాలు పఠించడం వల్ల మనసుకు చాలా హాయిగా ఉంటుంది. సీతారాములను పూజిస్తూ ఈ శ్లోకాలు జపించండి. మీకున్న సమస్యలు ఒత్తిడి, ఆందోళన తొలగిపోతాయి. జీవితంలో వచ్చే సవాళ్ళని ఎదుర్కొనే ధైర్యం మీకు లభిస్తుంది. రాముడిని ఆరాధించడం వల్ల అదృష్టం లభిస్తుంది. సకల సుఖాలు అనుభవించగలుగుతారు.

రామ అనే పదం ఉచ్చరించకుండా కొంతమందికి రోజు కూడా గడవదు. ఏదో ఒక సందర్భంలో మనకి తెలియకుండానే ఈ పేరు పలుకుతాము. ఎంతో శక్తివంతమైన పవిత్రమైన ఈ తారక మంత్రం పఠించడం వల్ల శ్రీరాముడి అనుగ్రహం లభిస్తుంది.

శ్రీరామనవమి రోజు రాముడికి ప్రత్యేకంగా పూజలు చేసి శ్రీరామ నామాన్ని జపించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. రామా అనే రెండు అక్షరాలు జపించడం వల్ల అధ్యాత్మికంగా బలపడతారు. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. శ్రీ రాముడి అనుగ్రహం కోసం ఈ శ్రీరామనవమి రోజున మంత్రాలు పఠించండి.

శ్రీరామ రామ రమితి రమే రామే మనోరమే

సహస్రనామత తుల్యం రామనామ వరాననే||

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే

రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః||

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం

ఆరుహ్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం||

ఆపడా మపహార్తారం దాతరాం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్||

దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా

పురతో మారుతిరస్య తం వందే రఘునందన||

శ్రీరామ జయ రామ కోదండ రామ

శ్రీరామ చంద్రాయ నమః

శ్రీ రామ పంచ రత్న స్తోత్రం

కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ

కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 1 ॥

విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ

వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 2 ॥

సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయ

సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 3 ॥

పీతాంబరాలంకృత మధ్యకాయ పితామహేంద్రామర వందితాయ

పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 4 ॥

నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ

నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ॥ 5 ॥

ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యః పఠేన్నరః

సర్వపాప వినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్ ॥

ఇతి శ్రీశంకరాచార్య విరచిత శ్రీరామపంచరత్నం సంపూర్ణం.

చిన్నపిల్లలకు శ్రీరాముడికి సంబంధించి శ్లోకాలు నేర్పించడం వల్ల వారి ఏకాగ్రత పెరుగుతుంది. మానసిక వికాసానికి తోడ్పడుతుంది. శ్రీరామ రక్ష స్త్రోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరతాయి.

శ్రీరామ రక్ష స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల శత్రువుల నుంచి మీకు ఎటువంటి హాని జరగదు. ఇది ఒక రక్షణ కవచంలాగా పని చేస్తుంది. దీన్ని పఠిస్తే దీర్ఘాయువు లభిస్తుంది. అన్ని రకాల విపత్తుల నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా శ్రీరాముడు మీకు అండగా నిలుస్తాడు. మీ మనసులోని కోరిక తీరాలంటే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పదకొండు సార్లు నలభై ఒక్క రోజుల పాటు పఠించాలి. ఇలా చేశారంటే మీ సమస్యలన్నీ తీరిపోయి కోరిక నెరవేరుతుంది.

WhatsApp channel