Nava panchama rajayogam: 100 సంవత్సరాల తర్వాత రాహు, కుజుడి వల్ల నవపంచమ రాజయోగం- మూడు రాశుల వారికి లాభాలే-rahu and mars transit will create nava panchama raja yogam after 100 years three zodiac signs get benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Nava Panchama Rajayogam: 100 సంవత్సరాల తర్వాత రాహు, కుజుడి వల్ల నవపంచమ రాజయోగం- మూడు రాశుల వారికి లాభాలే

Nava panchama rajayogam: 100 సంవత్సరాల తర్వాత రాహు, కుజుడి వల్ల నవపంచమ రాజయోగం- మూడు రాశుల వారికి లాభాలే

Gunti Soundarya HT Telugu
Oct 23, 2024 06:40 PM IST

Nava panchama rajayogam: సుమారు వంద సంవత్సరాల తర్వాత రాహువు, కుజుడి కలయిక వల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి దీపావళి పండుగ ముందే వచ్చినట్టుగా ఉంటుంది. జీవితం ఆనందంతో నిండిపోతుంది. ఏయే రాశులు లాభపడతాయో తెలుసుకుందాం.

నవ పంచమ రాజయోగం
నవ పంచమ రాజయోగం

ఒకే రాశిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు శుభ స్థానంలో కలిస్తే రాజయోగం ఏర్పడుతుంది. ఇవి తరచుగా సానుకూల మార్పులు తీసుకొస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో రాజయోగం ఉంటే సిరిసంపదలకు, శ్రేయస్సుకు లోటు ఉండదు.

ఈ దీపావళికి రాహువు, కుజుడు కలిసి మూడు రాశుల వారికి అద్భుతమైన జీవితాన్ని ఇవ్వబోతున్నారు. నవగ్రహాలలో రాహువు బలమైన గ్రహం. చెడు ఫలితాలు మాత్రమే ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు. కానీ నిజానికి జాతకంలో రాహువు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి రాజులాంటి జీవితం లభిస్తుంది.

ధైర్యం, శౌర్యం, పరాక్రమాన్ని ఇచ్చే కుజుడి సంచారం కూడా జ్యోతిష్య శాస్త్రంలో కీలకంగా పరిగణిస్తారు. ప్రస్తుతం కుజుడు అక్టోబర్ 20 నుంచి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అటు రాహువు గతేడాది నుంచి మీన రాశిలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాల స్థానం వల్ల అద్భుతమైన నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. అయితే వ్యక్తి జాతంలో ఈ రెండు గ్రహాల స్థానం సరిగా ఉన్నప్పుడే రాజయోగం ఫలితం పొందగలుగుతారు.

పంచమహా పురుష రాజయోగాలలో ఇది ఒకటి. ఇది జాతకంలో ఉంటే కొన్ని అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సంపద, అదృష్టం వారిస్తాయి. జీవితమే మారిపోతుంది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. సుమారు వంద సంవత్సరాల తర్వాత రాహువు, కుజుడి వల్ల ఏర్పడిన నవ పంచమ యోగం మూడు రాశుల వారి భవిష్యత్ ని మార్చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఇది చాలా పవిత్రమైన యోగంగా భావిస్తారు. ఈ యోగం వల్ల లాభపడే రాశులు ఏవో చూద్దాం.

మిథున రాశి

నవ పంచమ రాజయోగం వల్ల మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. పని, వృత్తిలో సానుకూల మార్పులను తీసుకొస్తుంది. కెరీర్ రంగంలో ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. జీవితంలో ఎదిగేందుకు ఇది సరైన అవకాశం. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల ఉంటుంది. వ్యాపార రంగంలో ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి. ఆశించిన దాని కంటే ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో సంతోషకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టే వారికి మంచే జరుగుతుంది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి దీపావళి ముందే వచ్చినట్టుగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవితం ఆనందంతో నిండిపోతుంది. ఈ సమయంలో మీ జీవితం కీలక మలుపు తీసుకుంటుంది. రాహువు మార్పు వల్ల వైవాహిక జీవితంలో అనుకోని సంతోషం, అదృష్టం వెల్లివిరుస్తాయి. పెళ్లి చేసుకునే వారికి శుభం కలుగుతుంది. ఉద్యోగంలో మార్పు ఆనందం కలిగిస్తుంది. డబ్బు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగులకు జీతం పెంపుదల అవకాశాలు ఉన్నాయి.

వృషభ రాశి

రాహు, కుజ సంచారం వల్ల ఏర్పడిన ఈ రాజయోగం వృషభ రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తుంది. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner