Mercury transit: సింహ రాశిలో బుధుడి ప్రవేశంతో ఈ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది-mercury transit in simha rashi these zodiac signs get luck ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Transit: సింహ రాశిలో బుధుడి ప్రవేశంతో ఈ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది

Mercury transit: సింహ రాశిలో బుధుడి ప్రవేశంతో ఈ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది

Gunti Soundarya HT Telugu
Jul 06, 2024 09:22 AM IST

Mercury transit: మరికొద్ది రోజుల్లో బుధుడు సింహ రాశి ప్రవేశం చేయబోతున్నాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. అవి ఏ రాశులో తెలుసుకోండి.

సింహ రాశిలోకి బుధుడు
సింహ రాశిలోకి బుధుడు

Mercury transit: గ్రహాల రాకుమారుడు బుధుడు మరికొద్ది రోజుల్లో తన రాశిని మార్చుకోబోతున్నాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. నవగ్రహాలలో అత్యంత వేగంగా తన రాశిని బుధుడు మార్చుకుంటాడు.

yearly horoscope entry point

బుధుడు మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్, గణితం, తెలివి, స్నేహానికి బాధ్యత వహించే గ్రహంగా చెప్తారు. బుధుడు శుభప్రదంగా ఉంటే తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. జూలై 19 న బుధుడు కర్కాటకం నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశి సూర్యుడి సొంత రాశి. సింహ రాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టవంతులు అవుతారు. ఆగస్ట్ నెలలో సూర్యుడు కూడా సింహ రాశి ప్రవేశం చేస్తాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడు, సూర్యుడు స్నేహపూర్వక గ్రహాలుగా పరిగణిస్తారు. దీని ప్రభావంతో రెండు గ్రహాల అనుగ్రహం పొందుతారు. సింహ రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల ఏ రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం.

వృషభ రాశి

బుధుడి సంచారం వృషభ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక లాభం ఉంటుంది. కార్యాలయంలో మీరు చేసిన పనిని మెచ్చుకుంటారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి బుధ సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బుధ ప్రభావంతో ఆకస్మిక ధనం పొందుతారు. తెలివితేటలతో పనిలో విజయం సాధిస్తారు. సంపదను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. జీవితంలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.

సింహ రాశి

సింహ రాశిలోకే బుధుడి ప్రవేశం జరగబోతుంది. మీరు సోదరులు, సోదరీమణుల నుండి మద్దతు పొందుతారు. ఈ సమయంలో అదృష్టం మీ వైపు ఉంటుంది. ఈ సమయం ఉద్యోగం, వ్యాపారానికి వరం కంటే తక్కువ కాదు. గౌరవం, హోదా, ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు.

కన్యా రాశి

కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ సమయం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని వైపుల నుండి లాభాలు ఉంటాయి. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం కోసం సమయం అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు రాశి

ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ద్రవ్య లాభాలు ఉంటాయి, ఇది ఆర్థిక అంశాన్ని బలోపేతం చేస్తుంది. లావాదేవీలు చేయడానికి అనుకూలమైన సమయం. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. బుధ సంచారం ధనుస్సు రాశి వారి జీవితంలో గణనీయమైన మార్పులను తీసుకొస్తుంది. అదృష్టవశాత్తూ కొన్ని పనులు పూర్తవుతాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న జాతకులకు శుభవార్త అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. మీ పనులకు ప్రశంసలు దక్కుతాయి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనదని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.)

Whats_app_banner