Marriage Astrology: ఈ 5 రాశుల వారు వైవాహిక బంధంలో జాగ్రత్తగా ఉండాలి-marriage astrology these 5 zodiac signs that need to be careful in marriage ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Marriage Astrology: ఈ 5 రాశుల వారు వైవాహిక బంధంలో జాగ్రత్తగా ఉండాలి

Marriage Astrology: ఈ 5 రాశుల వారు వైవాహిక బంధంలో జాగ్రత్తగా ఉండాలి

HT Telugu Desk HT Telugu
Aug 30, 2023 06:00 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశులలో కొందరు తమ మొండితనం, అపరిపక్వ వైఖరితో ఎటువంటి కారణం లేకుండా ప్రాపంచిక జీవితాన్ని పాడు చేసుకుంటారు. తమ వైవాహిక జీవితం పదిలంగా ఉండాలంటే రాజీ, చర్చలే పరిష్కారం.

వైవాహిక బంధంలో జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు
వైవాహిక బంధంలో జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు

సంసార బంధం అంటే రెండు జీవితాల మధ్య ప్రేమ, నమ్మకం, సానుభూతి, పరస్పర అవగాహన, ఇవన్నీ ఉండాలి. అయితే కొందరు తమకు తెలియకుండానే తమ సంసార జీవితాన్ని చిక్కుల్లో పడేసుకుంటారు. వారి ఆనందాన్ని తమ చేతులతో నాశనం చేసుకుంటారు. దాన్ని ఎవరూ ఆపలేరు. కొందరికి పరిపక్వత లోపిస్తుంది. పరిస్థితిని అర్థం చేసుకునే వైఖరి ఉండదు. వారి ఉద్రేకత కారణంగా సంబంధాలు, వివాహాలు చెడిపోతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల్లో కొందరు అపరిపక్వ వైఖరితో వైవాహిక బంధాలు బీటలువారేలా చేస్తారు. కాబట్టి ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.

మేషరాశి

మేషరాశి వారు మొండి పట్టుదలగల వారు. స్వతంత్రులుగా ఉంటారు. ఇది వారి కుటుంబ జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. కానీ సమర్థవంతమైన సంభాషణ, రాజీ వైఖరితో వివాహ జీవితాన్ని మరమ్మత్తు చేయవచ్చు. ఇది సంబంధాన్ని కూడా బలోపేతం చేయగలదు.

వృషభం

ఈ రాశి వారు మొండి పట్టుదలగలవారు. మార్పును కోరుకోరు. ఇది వారి వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. ఏది ఏమైనా ఓపెన్ మైండెడ్‌గా, ఫ్లెక్సిబుల్ గా ఉండటం నేర్చుకుంటే వారి వైవాహిక బంధం పాలు తేనెలాగా ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదు.

సింహ రాశి

సింహరాశి వారు తమ భర్త లేదా భార్య ఎల్లప్పుడూ తమ పట్ల శ్రద్ధ వహించాలని, వారి కోరికలు, అవసరాలను తెలుసుకొని తదనుగుణంగా ప్రవర్తించాలనే వైఖరిని కలిగి ఉంటారు. ఈ రాశి భాగస్వామి దీనికి వ్యతిరేకంగా ఉంటే, వారి కుటుంబంలో చీలిక రావడం సహజం. ఇది కలహాలకు, విభేదాలకు దారి తీస్తుంది. దీనిని పరిష్కరించడానికి, స్వీయ-అవగాహన, పరస్పర మద్దతు, ప్రశంసల ద్వారా కుటుంబ బంధాన్ని బలోపేతం చేయవచ్చు.

వృశ్చికరాశి

వృశ్చిక రాశి వారికి అంతా వెంటనే జరగాలి అనే వైఖరి ఉంటుంది. ఈ గుణం వైవాహిక జీవితంలో విసుగుకు దారి తీస్తుంది. కానీ నమ్మకం, పరస్పర సంభాషణతో ఈ సమస్యలను పరిష్కరించవచ్చు. అయితే ఒకసారి వృశ్చిక రాశి జాతకుల వైవాహిక బంధం పటిష్టం అయిన తర్వాత అది సురక్షితంగా ఉంటుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు తమ భాగస్వామి తమ అవసరాలు, భావాలన్నింటినీ గౌరవించాలనే వైఖరిని కలిగి ఉంటారు. వారి వైవాహిక జీవితంలో నిబద్ధత లేకపోతే అసమతుల్యత ఉండవచ్చు. కానీ సమర్థవంతమైన సంభాషణ, రాజీపడే తత్వం వైవాహిక జీవితాన్ని అందంగా మార్చగలవు.

ఈ కారణంగా ఈ 5 రాశుల వారు తమ వైవాహిక, ప్రాపంచిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం, మీనం రాశుల వారు తమ దాంపత్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వారు తమ కుటుంబ జీవితాన్ని పాడు చేసుకోరు.