Karthika Masam: కార్తీక మాసం నెలరోజులూ ఏ రోజు ఏ పూజ చేస్తే మంచిదో.. వివరంగా తెల్సుకోండి..
Karthika Masam: కార్తీక మాసంలో ప్రతిరోజుకు ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజుల్లో రోజుకొక పారాయణం, దైవ నామస్మరణ చేయడం శుభదాయకం. ఈ నెలరోజులు ఏ రోజు ఏ పూజ చేస్తే మంచిదో వివరంగా తెల్సుకోండి.
కార్తీక మాసం పాపములనుండి బయటపడడానికి, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, భక్తిని పెంపొందించుకోవడానికి.. మోక్షమార్గమును సంపాదించుకోవడానికి అతి ఉత్తమమైన మార్గం. ఈ కార్తీక మాసం నెలరోజుల్లో ఏ రోజు ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తే మంచిదో వివరంగా చూసేయండి.
కార్తీక మాసం చేయాల్సిన పూజలు:
కార్తీకమాసంలో మొదటిరోజు పాడ్యమినాడు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయాలి.
రెండవరోజు విదియనాడు శివాష్టోత్తర శతనామావళి 12 సార్లు పారాయణ చేయాలి. మూడవరోజు తదియనాడు చంద్రశేఖరాష్టకమ్ 8 మార్లు పారాయణ చేయాలి. నాల్గవరోజు చవితినాడు గణనాయకాష్టకమ్ 8సార్లు పారాయణ చేయాలి.
ఐదవరోజు పంచమినాడు శివపంచాక్షరీ స్తోత్రమ్ 8 సార్లు పారాయణ చేయాలి. ఆరవరోజు షష్టినాడు సుబ్రహ్మణ్యాష్టకమ్ 8 సార్లు పారాయణ చేయాలి.
ఏడవరోజు సప్తమినాడు బిల్వాష్టకమ్ 8 సార్లు పారాయణ చేయాలి.
ఎనిమిదవరోజు అష్టమినాడు రుద్రవకవచమ్ 11 సార్లు చేయాలి.
తొమ్మిదవరోజు నవమినాడు శివస్తోత్రమ్ 11 సార్లు పారాయణ చేయాలి.
పదవరోజు విశ్వనాథాష్టకమ్ 8 సార్లు పారాయణ చేయాలి.
11వరోజు ఏకాదశినాడు ఏకాదశ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకమ్ చేయించుకోవాలి. 12వ రోజు ద్వాదశినాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతము ఆచరించాలి.
13వ రోజు త్రయోదశినాడు శనికి తైలాభిషేకము చేయించుకోవాలి.
14వరోజు చతుర్దశినాడు శివాష్టకమ్ 8 సార్లు పారాయణ చేయాలి.
15వ రోజు పూర్ణిమనాడు కేదారేశ్వరవ్రతము ఆచరించాలి.
16 వ రోజు బ.పాడ్యమి నాడు లింగాష్టకమ్ 8 సార్లు పారాయణ చేయాలి.
17వరోజు విదియనాడు రుద్రాష్టకమ్ 8 సార్లు పారాయణ చేయాలి.
18 వ రోజు తదియనాడు ఉమామహేశ్వరాష్టకమ్ 8సార్లు పారాయణచేయాలి.
19వ రోజు చవితినాడు సంకటనాశన గణేశస్తోత్రమ్ 8సార్లు పారాయణ చేయాలి. 20వరోజు పంచమినాడు శివనామావళ్యాష్టకమ్ రిసార్లు పారాయణ చేయాలి.
21వరోజు షష్టినాడు సుబ్రహ్మణ్యకరావలంబస్తోత్రమ్ 8సార్లు పారాయణ చేయాలి.
22 వరోజు సప్తమినాడు శివద్వాదశనామస్మరణమ్ 12సార్లు పారాయణ చేయాలి.
23 వరోజు అష్టమినాడు పార్వతీవల్లభ నీలకంఠాష్టకమ్ 8సార్లు పారాయణ చేయాలి. 24వరోజు నవమినాడు ఉమామహేశ్వరస్తోత్రమ్ 11సార్లు పారాయణ చేయాలి. 25వరోజు దశమినాడు శివమానసపూజాస్తోత్రమ్ 11సార్లు పారాయణ చేయాలి.
26వ రోజు ఏకాదశినాడు శ్రీ సత్యనారాయణ వ్రతము ఆచరించాలి.
2'7వరోజు ద్వాదశినాడు ద్వాదశజ్యోతిర్లింగస్తోత్రమ్ 8సార్లు పారాయణ చేయాలి. 28వరోజు త్రయోదశినాడు శనికి తైలాభిషేకము చేయించుకోవాలి.
29వ రోజు చతుర్దశినాడు శివప్రాతస్మరణస్తోత్రమ్ 11సార్లు పారాయణ చేయాలి.
30 వరోజు అమావాస్యనాడు శతరుద్రీయమ్ పారాయణతో అభిషేకము చేయించుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.