Sri rama navami lucky zodiac signs: శ్రీరామనవమి రోజు నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి-jupiter nakshtra transit sri rama navami get bless these zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sri Rama Navami Lucky Zodiac Signs: శ్రీరామనవమి రోజు నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి

Sri rama navami lucky zodiac signs: శ్రీరామనవమి రోజు నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి

Gunti Soundarya HT Telugu
Apr 14, 2024 02:14 PM IST

Sri rama navami lucky zodiac signs: శ్రీరామనవమి రోజునే దేవగురువు బృహస్పతి నక్షత్ర మార్పు జరగబోతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి మంచి ఘడియలు రాబోతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందబోతున్నారు.

శ్రీరామనవమి నుంచి వీరికి మంచి రోజులే
శ్రీరామనవమి నుంచి వీరికి మంచి రోజులే (pinterest)

Sri rama navami lucky zodiac signs: శ్రీరామనవమి హిందూమతంలోని ప్రధాన పండుగలలో ఒకటి. మత విశ్వాసాల ప్రకారం చైత్రమాసం తొమ్మిదో రోజున దశరథ మహారాజు పెద్ద కుమారుడిగా శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. అందుకే ఈ రోజున శ్రీరాముని ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు శ్రీరాముడిని, సిద్ధి ధాత్రి అమ్మవారిని పూజిస్తే సకల బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 17న శ్రీరామనవమి జరుపుకుంటారు. అదే రోజుతో చైత్ర నవరాత్రులు కూడా ముగియనున్నాయి. వీటితోపాటు కీలకమైన గ్రహాల సంచారం కూడా జరగనుంది. దేవ గురువుగా భావించే బృహస్పతి శ్రీరామనవమి రోజు నక్షత్రం మార్చుకోబోతున్నాడు. ఇవి రెండూ కలిసి కొంతమందికి అద్భుతమైన రోజుగా మారనుంది.

భరణి నక్షత్రంలో సంచరిస్తున్న బృహస్పతి ఏప్రిల్ 17న కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి కృతిక నక్షత్రంలో జూన్ 13 వరకు ఉంటాడు. ఈ సమయంలోనే బృహస్పతి మేష రాశి నుంచి వృషభ రాశిలోకి సంచరిస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. సంతోషం, అదృష్టం పెరిగే అవకాశాలు ఉన్నాయి. గురు నక్షత్ర మార్పు కారణంగా శ్రీరామనవమి నుంచి కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఏయే రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయో చూద్దాం.

మేష రాశి

గురు నక్షత్ర మార్పు, శ్రీరామనవమి రెండూ కలిసి రావడంతో మేష రాశి వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. ధన లాభాలు కలుగుతాయి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. వస్తు సంపద పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రతి పనిలో సానుకూల ఫలితాలు పొందుతారు. బృహస్పతి నక్షత్ర సంచారం మేష రాశి లగ్నృహంలో జరుగుతుంది. ఫలితంగా వీరికి ప్రత్యేక గురు గ్రహ ఆదరణ, ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల డబ్బు ఆదా చేసుకోగలుగుతారు.

సింహ రాశి

శ్రీరామనవమి నుంచి సింహ రాశి వారికి మంచిరోజులు ప్రారంభమవుతాయి. అదృష్టం వెన్నంటే ఉంటుంది. మీరు కోరుకున్న కలలన్నీ నిజమవుతాయి. మంచి ప్యాకేజీతో కొత్త జాబ్ ఆఫర్ లభిస్తుంది. శుభకార్యాలు ఇంట్లో నిర్వహించుకుంటారు. వృత్తి జీవితంలో విజయానికి కొత్త మార్గాలు తారసపడతాయి.

తులా రాశి

శ్రీరాముడి ఆశీస్సులు, బృహస్పతి అనుగ్రహంతో తులా రాశి వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థిక పరిస్థితిని ఇప్పటి కంటే మెరుగ్గా ఉంటుంది. సంపద పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. భూమి లేదా వాహనం కొనుగోలుకు అవకాశం ఉంది.

వృశ్చిక రాశి

వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో డబ్బు సంపాదించేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తిలో నూతన విజయాలు సొంతం చేసుకుంటారు. చాలా కాలంగా బకాయి పడిన డబ్బు చేతికి అందుతుంది. సంతానం వైపు నుంచి మంచి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో అపారమైన లాభాలు పొందుతారు. ఆదాయం పెరిగే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఉద్యోగులకు బోనస్, ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అందుకుంటారు. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. వివాహ ప్రతిపాదనలు రావచ్చు. సామాజిక గౌరవం పెరుగుతుంది.

WhatsApp channel