గజకేసరి యోగం.. ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
Gajakesari Yog: డిసెంబర్ లో దేవ గురు బృహస్పతితో పాటు మరికొన్ని గ్రహాలు వాటి రాశి చక్రం మారబోతుంది. దాని వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన గజకేసరి యోగం పట్టబోతుంది.
Gajakesari Yog: డిసెంబర్ నెలలో అనేక గ్రహాలు తమ రాశిని మార్చుకుంటున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి తన దిశ మార్చుకుంటుంది. దాని వల్ల గజకేసరి యోగం లభించబోతుంది. దేవ గురువు బృహస్పతి అంటేనే ఐశ్వర్యం, వైభవం, సంపద గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ యోగం ప్రభావం కొన్ని రాశుల మీద ప్రభావం చూపనుంది.
జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది మహా అద్భుతమైన యోగంగా చెబుతారు. ఈ యోగంలో ధనలాభం అధికంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో ఏ పని ప్రారంభించినా కూడా అన్నింటినీలోనూ విజయం చేకూరుతుంది. బృహస్పతి చంద్రుడి కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ యోగం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఫలితంగా ఈ మూడు రాశుల వారిని అదృష్టం వరించబోతుంది.
మేష రాశి
మేష రాశిలో గురువు చంద్రుల కలయిక ఉంటుంది. ఇది చాలా శుభప్రదం. దీని వల్ల ఈ రాశి వారు అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. బిజినెస్ లో లాభాలు ఆర్జిస్తారు. పని చేసే చోట మన్ననలు లభిస్తాయి.
సింహ రాశి
గజకేసరి యోగం వల్ల సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించి అన్నింటిలోనూ విజయాలు సాధిస్తారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులు ఈ యోగంలో పూర్తి అవుతాయి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతుంది. మానసిక పరమైన సమస్యల నుంచి బయట పడతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు శుభవార్త వింటారు. పదోన్నతులు పొందే అవకాశం ఉంది.
ధనస్సు
ధనస్సు రాశి వారికి గజకేసరి యోగం మరింత ప్రత్యేకతనిస్తుంది. సూర్యచంద్రుల కలయిక వల్ల ఏర్పడబోతున్న ఈ యోగం వల్ల ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు చేసే వాళ్ళు లాభాలు గడిస్తారు. లక్ష్మీమాత అనుగ్రహం వల్ల సంపద మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. దాతృత్వవ గుణం కలిగి ఉంటారు. ఏ పని అయినా అవలీలగా చేసుకోగలుగుతారు.