Shani remedies: వంట గదిలో ఉన్న ఈ చిన్న వస్తువు చాలు శని దోషాల నుంచి మీకు విముక్తి కలిగించడానికి
Shani remedies: ఆర్థిక సమస్యలు, ఆటంకాలు, నరదృష్టి, శని దోషాలు ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని వదిలించుకోవడం కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కేవలం మీ కిచెన్ లో ఉన్న ఈ చిన్న వస్తువు చాలు శని గ్రహ బాధలు తొలగించి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం.
ఏదైనా పనిలో పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నా? డబ్బులు నష్టపోతున్నా శని పట్టుకున్నట్టు ఉంది ఒక్క పని కూడా కావడం లేదని తిట్టుకుంటారు. నవగ్రహాలలో క్రూరమైన గ్రహంగా శని దేవుడిని భావిస్తారు. ఎందుకంటే శని దశలు ఒక వ్యక్తి జాతకంలో ఉంటే అతడి తలరాత పూర్తిగా మారిపోతుంది.
శని శుభ స్థానంలో ఉంటే మాత్రం రాజభోగాన్ని అనుభవిస్తారు. అదే శని అశుభ స్థానంలో ఉంటే ఎక్కడ లేని కష్టాలు వచ్చి నెత్తి మీద పడినట్టుగా అయిపోతుంది. ఏది చేసిన కలిసి రాదు. అందుకే శని ప్రభావం జాతకం మీద చాల ఎక్కువగా ఉంటుంది. శని దోషం, లేదా ఏలినాటి శని ప్రభావాలు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. శనివారం ఆలయానికి వెళ్ళడం, తైలాభిషేకం చేయడం వంటి పనులు చేస్తారు. అలాగే శని మంత్రాలు పఠిస్తారు.
శని దోషాలు తొలగించే మార్గాలు
శని వల్ల మీరు ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారా? అయితే మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఏవేవో పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. కేవలం మీ కిచెన్ లో దొరికే ఈ చిన్న పదార్థం చాలు. మీకున్న శని బాధలను ఇట్టే తొలగించేస్తుంది. అది మరేదో కాదు నల్ల మిరియాలు. ప్రతి ఒక్కరి వంట గదిలో నల్ల మిరియాలు తప్పనిసరిగా ఉంటాయి. వాటితో చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల శని చెడు ప్రభావాల నుంచి బయట పడొచ్చు. అవేంటో చూద్దాం.
ఒక ఐదు నల్ల మిరియాలు తీసుకోండి. రాత్రివేళ ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళి వాటిని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోవాలి. నాలుగు మిరియాలను నాలుగు దిక్కులా విసిరేయాలి. ఇక ఐదో మిరియం ఆకాశంలోకి విసిరేయాలి. అలా చేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా చేయడం వల్ల శని దుష్ప్రభావాలు తగ్గుతాయి.
పదకొండు రూపాయలు తీసుకుని నల్ల వస్త్రంలో పెట్టుకోవాలి. అందులో కొన్ని నల్ల మిరియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మూట కట్టి ఎవరికైనా దానం చేయాలి లేదంటే శని దేవాలయంలో ఇవ్వాలి. ఇలా చేస్తే శని గ్రహ బాధలు తొలగిపోతాయి.
వృత్తి, ఉద్యోగంలో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నట్టయితే మీరు ఇంట్లో నుంచి ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు గుమ్మం మీద నల్ల మిరియాలు పెట్టుకుని వాటిని తొక్కాలి. ఆ తర్వాత ఇల్లు దాటి వెళ్తే మీ పనుల్లో ఆటంకాలు తొలగి విజయవంతం అవుతాయి.
ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ సింపుల్ రెమిడీ పాటించి చూడండి. ఇంట్లో ఏదైనా ఒక మూలలో దీపం పెట్టి అందులో ఏడు లేదా ఎనిమిది మిరియాలు వేసి కాల్చాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి మీద ఉన్న చెడు, నరదృష్టి తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. డబ్బు చేతిలో నిలుస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.