Elinati shani: శని నక్షత్ర సంచారం ఏలినాటి శని ఉన్న రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
Elinati shani: 3న శని రాహువుకు చెందిన నక్షత్రంలోకి ప్రవేశించింది. శని కదలికలో మార్పు ఏలినాటి శని, అర్థాష్టమ శనితో బాధపడుతున్న రాశిచక్ర గుర్తులను కూడా ప్రభావితం చేస్తుంది. డిసెంబర్ వరకు శని ప్రభావం ఏయే రాశుల మీద ఎలా ఉండబోతుందో చూద్దాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహలలో శనిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు. అందుకు కారణం కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తాడు. తొమ్మిది గ్రహాలలో శని చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహం.
శని ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని ఒక నిర్దిష్ట సమయంలో నక్షత్రాలను కూడా మారుస్తాడు. శని నక్షత్రం మార్పు 03 అక్టోబర్ 2024 గురువారం నాడు జరిగింది. శని రాహువు అధిపతిగా ఉన్న శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు. శని నక్షత్రం మార్పు ప్రభావం అన్ని రాశులపై కనిపిస్తుంది.
శని ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్నాడు. శని సంచరిస్తున్న రాశికి అనుగుణంగా ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావం ఉంటుంది. దీని కారణంగా కుంభం, మీనం, మకర రాశుల వారికి శని ఏలినాటి శని(సడే సతి) జరుగుతోంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారికి అర్థాష్టమ శని(దయ్యా) ప్రభావం ఉంటుంది. శని రాశిలో మార్పు జరిగినప్పుడు సడే సతి, దయ్యాతో బాధపడుతున్న రాశిచక్ర గుర్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం శని నక్షత్ర మార్పు ఈ 5 రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోండి.
ఏలినాటి శని రాశులపై ప్రభావం
శని నక్షత్రంలో మార్పు కారణంగా మకర రాశి వారికి అధిక డబ్బు ఖర్చు ఒత్తిడిని పెంచుతుంది. మీరు కొన్ని కుటుంబ పనుల గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. కడుపు లేదా కాళ్ళకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. శని మార్పు ప్రభావం వల్ల కుంభ రాశి వారికి కోపం పెరగవచ్చు.
వైవాహిక సంబంధాలలో విభేదాలు ఉండవచ్చు. ఉద్యోగ, వ్యాపారాలలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో కొత్త బాధ్యతల వల్ల సమస్యలు వస్తాయి. మీన రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. మీరు కుటుంబ సంబంధిత పనుల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
అర్థాష్టమ శని రాశులకు ఇలా
వృశ్చిక రాశి వారు తమ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కష్టపడి చేసే పనిలో ఉద్రిక్తత లేదా గందరగోళ పరిస్థితి ఉండవచ్చు. అయితే కొన్ని పాత వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇది వీరికి ఊరటనిచ్చే అంశం. కర్కాటక రాశి వారికి కడుపు సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. అలాగే కాళ్లకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. మాటల్లో కఠినత్వం ఎదుటి వారి మనసును గాయపరుస్తుంది. ధన వ్యయం పెరగవచ్చు.
ధృక్ పంచాంగం ప్రకారం శని అక్టోబర్ 3 నుంచి శతభిషా నక్షత్రంలో ఉన్నాడు. డిసెంబర్ 27, 2024 రాత్రి 10.42 గంటల వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు. అనంతరం పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి దేవగురువు బృహస్పతి. ఇక శని రాశి మార్పు 2025 సంవత్సరంలో ఉంటుంది. కుంభ రాశిలో ఉన్న శని జనవరి 29, 2025 లో మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.
శని నక్షత్ర సంచారం వల్ల మేషం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మీన రాశులకు అశుభకరంగా ఉంటుంది. ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృషభం, మిథునం, కన్య, తుల రాశుల వారికి శుభదాయకంగా ఉంటుంది. అయితే జాతకంలో శని స్థానం మీద ఈ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. శని శుభ స్థానంలో ఉంటే మంచి జరుగుతుంది. అదే అశుభ స్థానంలో ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.