Jagannath rathayatra 2024: రేపటి నుంచే జగన్నాథ రథయాత్ర.. ఈ రథాల గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం-famous jagannath ratha yatra starts from july 7th 2024 interesting facts about chariots ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jagannath Rathayatra 2024: రేపటి నుంచే జగన్నాథ రథయాత్ర.. ఈ రథాల గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం

Jagannath rathayatra 2024: రేపటి నుంచే జగన్నాథ రథయాత్ర.. ఈ రథాల గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం

Gunti Soundarya HT Telugu
Jul 06, 2024 11:20 AM IST

Jagannath rathayatra 2024: ప్రముఖ పూరీ క్షేత్రంలోని జగన్నాథ రథయాత్ర రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఏటా ఆషాడ మాసంలో ప్రారంభమయ్యే ఈ రథయాత్రకు సంబంధించిన కొన్ని విషయాలు మీకోసం.

జగన్నాథ రథయాత్రకు సిద్ధమవుతోన్న రథాలు
జగన్నాథ రథయాత్రకు సిద్ధమవుతోన్న రథాలు (ANI)

Jagannath rathayatra 2024: ఒడిశాలోని పూరీ తీరంలో జరిగే జగన్నాథ రథయాత్ర రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తారు. ఆషాడ మాసంలో తొమ్మిది రోజుల పాటు ఈ వార్షిక పండుగ జరుగుతుంది. జగన్నాథ రథయాత్ర ఆషాడమాసంలోని రెండవ రోజు లేదా ద్వితీయ తిథిన ప్రారంభం అవుతుంది. దశమి తిథితో ముగుస్తుంది. 

ఈ ఏడాది పూరీ జగన్నాథ రథయాత్ర ఆదివారం జులై 7న ఉదయం 4.26 గంటలకు ప్రారంభం అవుతుంది.  జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర దేవి రథాలు ఊరేగింపుగా గుండిచా ఆలయం వరకు వెళతాయి ఈ రథయాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం. 

జగన్నాథుడు విష్ణు అవతారం అని నమ్ముతారు. ఒడిశాలోని పూరీలో ఉన్న ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో జగన్నాథ స్వామిని ప్రధానంగా పూజిస్తారు. చార్ థామ్ యాత్రల్లో జగన్నాథ యాత్ర కూడా ఒకటి.  జగన్నాథుడితో పాటు సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర దేవిని కూడా పూజిస్తారు. ఈ రథయాత్రలో గర్భగుడిలోని విగ్రహాలను బయటకు తీసుకువచ్చి రథాలలో పెడతారు. 

ఏటా కొత్త రథాలు 

ఇంద్రయుమ్న రాజు అయిన భార్య గుండిచా రాణికి చేసిన వాగ్దానం ప్రకారం ప్రతి సంవత్సరం జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర దేవి ఈ ఆలయాన్ని  సందర్శిస్తారని నమ్ముతారు. ఇంద్రయుమ్న ఈ ఆలయాన్ని నిర్మించారు.

ముగ్గురికి మూడు వేరు వేరు రథాలు ఉంటాయి. వాటిని ఏటా కొత్తగా తయారు చేస్తారు. జగన్నాథ రథాన్ని నందిఘోష, బలరాముడి రథాన్ని తాళధ్వజ అని సుభద్ర రథాన్ని దేవదాలన అని పిలుస్తారు. ఏటా ముక్కోటి దేవతలకు కొత్త రథాల తయారు చేస్తారు. నిర్మాణం, కొలతలు మాత్రం అవే పాటిస్తారు. తయారీకి ఉపయోగించే పదార్థాలు మాత్రం కొత్తవి.

మూడు రథాల నిర్మాణం అక్షయ తృతీయ నాడు ప్రారంభమవుతుంది. దాదాపు 1400 మంది వడ్రంగులు ఎంతో శ్రమించి ఈ రథాలు నిర్మించేందుకు పనిచేస్తారు. ఇందులో ఎటువంటి ఇనుము ఉపయోగించరు. కొలతలు కూడా చేతితో, వేళ్ళతోనే కొలుస్తారు. ఈ రథాలు తయారు చేసేందుకు ఉపయోగించే కలప ప్రత్యేకంగా ఉంటుంది. 

జగన్నాథ రథయాత్రలో ఈ రథాలను లాగే ముందు బంగారు చీపురుతో ఊడుస్తారు. ఆ తర్వాతే రథయాత్ర ప్రారంభం అవుతుంది. మొదట రథాలు ఏ మాత్రం కదలవని కానీ కొన్ని గంటల తర్వాత మాత్రం వాటికవే కదులుతాయని చెప్తారు. ఈ రథాలు లాగేందుకు ఎటువంటి యంత్రాలు, గుర్రాలు ఉండవు. ఈ యాత్రను సందర్శించే భక్తులే రథాలను లాగుతారు. వీటిని లాగడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

రథాల ప్రత్యేకతలు 

జగన్నాథ ఆలయాన్ని విడిచిపెట్టిన తర్వాత జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర దేవి తొమ్మిది రోజులపాటు గుండిచా ఆలయంలో  ఉంటారు. దశమి రోజున రథయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. దీని బహుదా యాత్ర అంటారు. జగన్నాథ రథం నందిఘోష 16 చక్రాలను కలిగి ఉంటుంది. ఎరుపు పసుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. ఈ రథానికి సారధి దారుకుడు. తాడును శంఖచూడ అంటారు. 

బలరాముడి రథానికి 14 చక్రాలు ఉంటాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో అలంకరిస్తారు. రథసారధి పేరు మాతలి. లాగే తాడుని వసూలి అని పిలుస్తారు. ఇక  సుభద్ర దేవి రథానికి 12 చక్రాలు ఉంటాయి. ఎరుపు నలుపు రంగు దుస్తులతో  అలంకరిస్తారు. రథసారథిగా అర్జునుడు, తాడుని స్వర్ణచూడ అని పిలుస్తారు. ముందుగా బలరాముడి రథం, తర్వాత సుభద్ర దేవిది, చివరగా జగన్నాథుడి రథాన్ని లాగుతారు. 

జగన్నాథ నామాన్ని స్మరిస్తూ రథయాత్రలో గుండిచా ఆలయానికి వెళ్లే వ్యక్తి పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందుతాడని స్కంద పురాణంలో వివరించారు. రథయాత్రలో స్వచ్చమైన మనసులో  పాల్గొన్న వారి కోరికలన్నీ నెరవేరుతాయి. 

 

 

Whats_app_banner