Tholi Ekadashi: తొలి ఏకాదశితోనే లోకంలో ఉపవాసమనే దీక్ష మొదలైందా? ఏకాదశినాడు ఎందుకు ఉపవాసం చేయాలి?
Tholi Ekadashi: తొలి ఏకాదశి హిందువులకు ఎంతో పవిత్రమైనది. ఆరోజు కచ్చితంగా ఉపవాసం ఉండేవారి సంఖ్య ఎక్కువే. మొదటిసారి ఉపవాసం అనేది మొదలైంతే తొలిఏకాదశి నుంచి అని చెబుతారు.
Tholi Ekadashi: ఏదైనా మంచిపని మొదలుపెట్టాలంటే ఏకాదశిని మించిన మంచి తిధి లేదు. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది ఆషాడ శుక్ల ఏకాదశి. దీన్నే తొలి ఏకాదశి అంటారు. లోకంలో ఉపవాసం అనేది తొలి ఏకాదశితోనే మొదలైనందని చెబుతారు.
ప్రాచీన గ్రంథాలు చెబుతున్న ప్రకారం ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు పాలసముద్రంపై యోగనిద్రలోకి వెళ్లినట్టు చెబుతారు. ఆరోజే తొలి ఏకాదశి. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే విష్ణువు యోగనిద్రలోకి జారుకుంటుంది కాబట్టి శయన ఏకాదశిగా మారింది. మోక్షం కావాలనుకుంటే ఈ తొలి ఏకాదశిని భక్తి ప్రపత్తులతో నిర్వహించుకోవాలి.
జాగారం చేసి...
తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం ఉండాలి. మరుసటి నాడు అంటే ద్వాదశి నాడు విష్ణమూర్తిని పూజించి ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రసాదాన్ని స్వీకరించాక భోజనం చేయాలి. ఇలా చేస్తే మోక్షాన్ని పొందవచ్చని ఎంతో మంది భక్తుల నమ్మకం. ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్లిన విష్ణుమూర్తి నాలుగు నెలల పాటూ అలా నిద్రలోనే ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు.
తొలి ఏకాదశి నాడు కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో పేల పిండి ఒకటి. పేలాలలో బెల్లం, యాలకులను వేసి బాగా దంచి దాన్ని తింటే ఎంతో మంచిది. ఈ పేల పిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పేల పిండి శరీరానికి సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుటంది. గ్రీష్మ రుతువు నుంచి వర్ష రుతువులోకి మారుతున్నకాలం ఇది. ఎలాంటి సీజన్ వ్యాధులు రాకుండా అడ్డుకునే శక్తి పేల పిండికి ఉంది. తొలి ఏకాదశినాడు ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ కోశం పరిశుద్ధంగా మారుతుంది. దేహానికి నూతనోత్తేజం దక్కుతుంది.
ఏకాదశి అంటే...
ఏకాదశిని మన శరీరంతో కూడా పోలుస్తారు. ఏకాదశి అంటే 11 అంకె. జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు, ఒక మనసు... ఈ మొత్తం కలిపి ఏకాదశి. తొలి ఏకాదశి నాడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు అన్నింటినీ మన ఆధీనంలోక తెచ్చుకోవాలి. పూర్తి ఏకాగ్రతతో పూజా, జాగరం, ఉపవాసం చేయాలి. దీని వల్ల ఇంద్రియ నిగ్రహం కూడా పెరుగుతుంది.
తొలి ఏకాదశి ఎప్పుడు?
ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి జూలై 16న రాత్రి 8:33 నిమిషాలకు మొదలవుతుంది. జూలై 17వ తేదీ రాత్రి 9:02 నిమిషాలకు ముగుస్తుంది. కాబట్టి తొలి ఏకాదశిని జూలై 17న చేసుకుంటారు. ఈ రోజు విష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇల్లు సుఖ సంతోషాలతో, సంపదలతో నిండి ఉంటుంది.
ఇలా పూజించండి...
తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. తల స్నానం చేయాలి. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు ముందు దీపం వెలిగించి, పూలు, పండ్లు, స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి. విష్ణువును పూజించేటప్పుడు కచ్చితంగా తులసీ దళాలను కూడా నివేదించడం మర్చిపోవద్దు. ఆ రోజంతా ఉపవాసం ఉండి, మరుసటి రోజు మళ్లీ దీపం పెట్టి ఉపవాస దీక్షను విరమించుకోవాలి.
టాపిక్