అక్టోబర్ 3, నేటి రాశి ఫలాలు-నవరాత్రుల తొలిరోజు పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది-devi navaratrulu first day october 3rd today rasi phalalu in telugu check all zodiac results for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అక్టోబర్ 3, నేటి రాశి ఫలాలు-నవరాత్రుల తొలిరోజు పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది

అక్టోబర్ 3, నేటి రాశి ఫలాలు-నవరాత్రుల తొలిరోజు పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది

HT Telugu Desk HT Telugu
Oct 03, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ03.10.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

అక్టోబర్ 3 నేటి రాశి ఫలాలు
అక్టోబర్ 3 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 03.10.2024

వారం: గురువారం, తిథి: పాడ్యమి,

నక్షత్రం: హస్త, మాసం: ఆశ్వయుజము ,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

కొంత శారీరక శ్రమ ఉంటుంది. తలపెట్టుకున్న పనులు పూర్తిచేసుకొంటారు. చిన్నపని తల పెట్టినా అది పెద్దపనిగా మారుతుంది. మార్పుచేర్పులకు శ్రీకారం చుట్టు సూచనలు గలవు. ఖర్చులు పెరుగుతున్నా భవిష్యతు చెందినవిగా ఉంటాయి. కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. సంతాన వ్యవహారాలలో చికాకులు ఎదుర్కోవలసి రావచ్చు.

వృష‌భం

వాగ్విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. ఉద్వేగ - నిరుత్సాహాలను దరి చేరనీయక జాగ్రత్తలు పాటించుకోండి. వాహన కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలందు మంచి ప్రయోజనాలు పొందగలరు. పెట్టుబడులందు తొందర నిర్ణయాలు వ‌ద్దు. ఆరోగ్య పరంగా బావుంటుంది. తీర్థయాత్రలు చేసే అవ‌కాశం ఉంది.

మిథునం

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్య పరంగా చిన్నతరహా జాగ్రత్తలు తప్పనిసరి. మంచి ఆలోచనలు చేయగలుగుతారు. అవకాశాలు కలసి వస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఉత్సాహకర స్థితులు ఏర్ప‌డతాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రోత్సాహాలు అందగలవు. సంతానపు ప్రయత్నాలు అనుకూలించగలవు. అధికారులతో సంయమనములు పాటించుకోవాలి.

క‌ర్కాట‌కం

వృత్తి, ఉద్యోగాల్లో అధికారిక బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో స‌త్సంబంధాలు ఉంటాయి. ప్రభుత్వమునకు పంపిన ప్రతిపాదనలు అనుమతుల్ని పొందగలవు. ప్రయాణాలందు జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఏర్పరచుకోగలుగుతారు. మానసిక, శారీరక ఉత్సా హములను పొందుతారు. భూగృహ, వాహనాది ప్రయోజనాలను ఏర్పరచుకోగలరు.

సింహం

ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా విశేష ప్రయోజనాలు పొందుతారు. బంధు మిత్రులచే గౌరవాలు ఏర్పరచుకోగలరు. చిరకాలం నుండి ఉన్న కోరికల్ని తీర్చుకోగలరు. ప్రయాణాలు ప్రయోజనం ఇస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు కొత్త ఉద్యోగాలు పొందగలుగుతారు. కొన్ని ప‌నులు ఆలస్యమైనా మంచి ఫలితములు పొందుతారు. భాగస్వాముల్ని, మిత్రుల్ని అంతంత మాత్రంగానే నమ్మండి.

క‌న్య‌

గ్రహ సంచారాలు మిశ్రమ ఫలితాలనివ్వగలవు. వృత్తి, ఉద్యోగాల్లో కీలక బాధ్యతలను స్వీకరించవలసి రావచ్చును. తొందరతనాలు,అలసత్వములు వంటివి పెరగగలవు. జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రణాళిక‌తో వ్యవహరించుకోవలసి వుంటుంది. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

తుల‌

మీదైన రంగాలలో వృద్ది చెందుటకు అవకాశాలు ఏర్పడతాయి. సంతాన వ్యవహారాలలో ఉత్సాహం ఇచ్చే వార్తలు ఉంటాయి. వ్యక్తిగతమైన గత ఇబ్బందుల్ని అధిగమించుటకు అవకాశాలు ఏర్పడతాయి. కుటుంబమున చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఏర్పడతాయి. ఇతరులకు సహకరిస్తారు. పెద్ద మొత్తాలతో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండండి. వాహన, యంత్రాదులను ఏర్పరచుకోగలుగుతారు.

వృశ్చికం

కొన్ని నిర్ణయాలు మానసిక ఇబ్బందులు ఏర్పరచగలవు. కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు పొందగలరు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. వ్యాపార రంగములందు సరైన జాగ్రత్తలు పాటించుకోవాలి. ఉద్యోగ వృత్తులందు ఆవేశపూరిత నిర్ణయములుండకుండా చూసుకోండి. ప్రయాణం, పెట్టుబడులకు దూరంగా ఉండుట మంచిది.

ధ‌ను‌స్సు

కుటుంబంలో గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాలందు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. గతమున వాయిదాపడినవి కొన్ని అప్రయత్నంగా పూర్తవుతాయి. భవిష్య అవసరాలకు చెందిన నిర్ణయాలను అమలు చేయగలుగుతారు. అవసరాలను సమర్థించుకోవ‌డానికి స‌రిప‌డా ఆదాయాలు ఉంటాయి. విద్యార్థులకు మంచి వ్యాసంగాలకు అవకాశాలు గలవు.

మ‌క‌రం

గ్రహ సంచారాలు ప్రయోజనమిస్తాయి. సంతానపరంగా విశేష ప్రయోజనాలు పొందుతారు. చక్కని ప్రణాళికలను అమలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నూతన అంశాలు చోటుచేసుకుంటాయి. అగ్రిమెంట్లు చేపట్టుకోగలరు. కొందరికి విదేశీ సంబంధ ప్రయోజనాలు సిద్ధించగలవు. వృత్తి, ఉద్యోగాలందు మార్పులు, ప్రమోషన్లు ఉంటాయి.

కుంభం

నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఒత్తిడికరంగా రోజు సాగుతుంది. కుటుంబ వ్యక్తుల ఆరోగ్యమునకై యోచనలు చేయవలసి రావచ్చును. ఆర్థిక అవసరాలను సమర్థించుకొను రీతిలో ఆదాయాలుంటాయి. వృత్తి, వ్యాపారాలందు హుషారుతనములున్నప్పటికి తెలియని ఆటంకాలను ఎదుర్కోవలసి ఉంటుంది. సంతాన అవసరాలు తీర్చుటకు అప్పులను చేయవలసిరావచ్చును. కుటుంబ వ్యక్తులచే సహకారాలుంటాయి.

మీనం

కుటుంబ వ్యవహారాలందు ఒంటరిగా పోరాటం చేస్తారు. మనోధైర్యంగా వ్య‌వహరించుకుంటారు. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులను నియంత్రించుకో గలుగుతారు. గతంలో వాయిదాపడిన కొన్నిటిని పూర్తి చేసుకోగలరు. యంత్ర వాహనములతో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. విద్యార్థులు ప్రణాళికాయుతంగా సాగాలి. వ్యాపారులు నెలవారీ చెల్లింపుల్ని పూర్తిచేసుకోగలరు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner