అక్టోబర్ 2, నేటి రాశి ఫలాలు- ఈరోజు వీరికి శ్రీమతి చొరవతో ఒక సమస్య తొలగిపోతుంది
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ02.10.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 02.10.2024
వారం: బుధవారం , తిథి: అమావాస్య,
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి, మాసం: భాద్రపదము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. మీ కృషికి సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పిల్లలకు శుభ ఫలితాలున్నాయి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం తగదు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
వృషభం
సర్వత్రా అనుకూలదాయకంగా ఉంటుంది. కార్యం సిద్ధిస్తుంది. ఆందోళన తగ్గి స్థిమిత పడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చు తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు.
మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఈరోజు చేసే సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. వాక్పటిమతో నెట్టుకొస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రణాళికాబద్దంగా పనులు పూర్తి చేస్తారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. అప్రమత్తంగా ఉండాలి. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. మీ ప్రమేయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
కర్కాటకం
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. మానసికంగా స్థిమిత పడతారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త అవసరం. బాధ్యతలు అప్పగించవద్దు, ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది.
సింహం
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు అధిక మవుతాయి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆప్తుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. కీలకపత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే అసహనం చెందుతారు.
కన్య
ఆర్థిక స్థితి నిరాశాజనకం. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆప్తుల కలయిక ఉత్సాహపరుస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
తుల
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి. పనుల్లో శ్రమ, చికాకులు అధికంగా ఉన్నాయి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవతలివారి స్తోమత తెలుసుకోండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి.
వృశ్చికం
మీ రంగంలో నిలదొక్కుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ వ్యక్తిత్వానికి గౌరవం లభిస్తుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి.
ధనుస్సు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ సామర్థ్యంపై ఎదుటివారికి నమ్మకం కుదురుతుంది. వ్యవహారాల్లో అప్ర మత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెట్టండి. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది.
మకరం
నేటి దిన ఫలాల ప్రకారం మకర రాశి వాళ్ళు ఈరోజు బాధ్యతగా వ్యవహరించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఆత్మస్థైర్యంతో శ్రమిస్తే విజయం తధ్యం. సలహాలు, సాయం ఆశించవద్దు. రావలసిన ధనం అందుతుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో మెలగండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
కుంభం
లక్ష్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. రాబోయే ఆదాయానికి ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
మీనం
ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. రుణ సమస్యలు తొలగుతాయి. ఖర్చులు అధికం. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. చిన్న విషయానికే చికాకుపడతారు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు.