Dattatreya Jayanthi 2022: దత్తాత్రేయ జయంతి పూజ సమయం, కథ, ప్రాముఖ్యతలు ఇవే..
Dattatreya Jayanthi 2022: ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజును.. దత్తాత్రేయ జయంతిగా నిర్వహించుకుంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. దత్తాత్రేయుని రూపంలో జన్మించినట్లు భక్తులు భావిస్తారు. అయితే దత్తాత్రేయ జయంతి రోజు ఏమి చేయాలి.. పూజా సమయం ఏమిటి? దాని వెనుకున్న కథ ఏమిటి వంటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Dattatreya Jayanthi 2022: 2022 సంవత్సరంలో దత్తాత్రేయ జయంతి డిసెంబర్ 8వ తేదీన వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం.. దత్తాత్రేయుని జన్మదినాన్ని.. మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దత్తాత్రేయ భగవానుడు.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమని భక్తులు నమ్ముతారు. ఈ ముగ్గురు దేవుళ్ల శక్తులు దత్తాత్రేయునిలో ఉన్నాయని నమ్ముతారు. అయితే దత్తాత్రేయుని ఎలా పూజించాలో, పవిత్రమైన సమయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దత్తాత్రేయ జయంతి 2022 పూజ సమయం
* పూర్ణిమ తిథి ప్రారంభం - డిసెంబర్ 7 ఉదయం 8.02 గంటలకు
* పౌర్ణమి తేదీ ముగింపు - డిసెంబర్ 8 ఉదయం 9.38 గంటలకు
* సిద్ధ యోగం - డిసెంబర్ 7 ఉదయం 2:52 నుంచి డిసెంబర్ 8 ఉదయం 2:54 వరకు
దత్తాత్రేయ జయంతి 2022 ప్రాముఖ్యత
ఈ రోజున దత్తాత్రేయుడిని ఆరాధించడం ద్వారా శివుడు, విష్ణువు, బ్రహ్మ అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. దీని కారణంగా ఆర్థిక వృద్ధితో సహా అనేక ఇతర ప్రయోజనాలు కలుగుతాయంటారు భక్తులు.
పూజా పద్ధతి
దత్తాత్రేయుడిని పూజించాలంటే.. ఉదయాన్నే స్నానం చేసి.. శుభ్రమైన దుస్తులు ధరించాలి. అనంతరం చౌకీలో ఎర్రటి వస్త్రాన్ని పరచి.. దానిలో దత్తాత్రేయ విగ్రహాన్ని ఉంచాలి. దానికి నీరు సమర్పించి.. రోలీ, చందనం, అన్నం వేయాలి. ఆ తర్వాత నెయ్యితో దీపాన్ని వెలిగించి.. దేవుడికి చూపించాలి. దేవుడికి ప్రసాదం సమర్పించి.. అనంతరం దత్తాత్రేయ భగవానుని కథ వినండి. మీ తాహతకు తగ్గట్లు బ్రాహ్మణులకు ఆహారం అందించండి. బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తర్వాతే ప్రసాదం అందించాలి.
దత్తాత్రేయ భగవానుని కథ
ఒకసారి మహర్షి అత్రి ముని భార్య అనసూయను పరీక్షించడానికి.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. భూమికి చేరుకున్నారు. ముక్కోటి దేవతలు మారువేషంలో అత్రి ముని ఆశ్రమానికి చేరుకుని.. తల్లి అనసూయ ముందు తమ ఆహార కోరికను వ్యక్తం చేశారు. ఆ ముగ్గురికి.. అనసూయ నగ్నంగా భోజనం పెట్టాలని షరతు పెట్టారు. దీంతో ఆ తల్లికి అనుమానం వచ్చింది.
జాగ్రత్తగా చూసేసరికి వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా గుర్తించింది. వారు సాధువుల రూపంలో తన ఎదురుగా నిల్చున్నట్లు గుర్తించింది. అప్పుడు అనసూయమ్మ.. అత్రిముని కమండలం నుంచి తీసిన నీటిని ముగ్గురు మహర్షులపై చల్లింది. వెంటనే వారు ఆరు నెలల శిశువులయ్యారు. తర్వాత అమ్మ వారికి నగ్నంగా తినిపించింది.
ముక్కోటి దేవుళ్లు శిశువులుగా మారిన తరువాత.. ముక్కోటి దేవతలు (పార్వతి, సరస్వతి, లక్ష్మీ) భూమికి చేరుకుని తల్లి అనసూయకు క్షమాపణ తెలిపారు. ముక్కోటి దేవుళ్లు కూడా తమ తప్పును అంగీకరించి.. ఆమె గర్భం నుంచి తమకు జన్మనివ్వాలని కోరారు. ఆ ముగ్గురు దేవుళ్లే.. దత్తాత్రేయునిగా జన్మించారు.
సంబంధిత కథనం