Astrology Tips : శనివారం ఇలా చేస్తే.. మీ శత్రుబాధలు తీరుతాయంట..-astrology tips in telugu for if you are troubled by enemy and adversary do these remedies ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Astrology Tips In Telugu For If You Are Troubled By Enemy And Adversary Do These Remedies

Astrology Tips : శనివారం ఇలా చేస్తే.. మీ శత్రుబాధలు తీరుతాయంట..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 26, 2022 08:28 AM IST

Astrology Tips : ఈకాలంలో మిత్రులు సంపాదించుకోవడం కన్నా.. శత్రువులను సంపాందించుకోవడం చాలా సులువు అయిపోతుంది. వారి జీవితంలో సమస్యలు మరింత పెరుగుతాయి. అయితే మీ శత్రువుపై మీరు విజయం సాధించాలంటే.. మీరు కొన్ని కొన్ని పరహారాలు చేయాలంటున్నారు జ్యోతిష్యులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శత్రు బాధలకు పరిహారాలు
శత్రు బాధలకు పరిహారాలు

Astrology Tips : మనం చేసేది.. మంచి అయినా.. చెడు అయినా శత్రువులు కచ్చితంగా ఉంటారు. మనల్ని వెనక్కి లాగేయాలని చూస్తూ ఉంటారు. మన పనుల్ని ఆపేసి.. మనం బాధపడుతుంటే చూసి ఎంజాయ్ చేయడమే వారిపని. వారి వల్ల పనుల్లో, జీవితాల్లో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే మీరు జ్యోతిష్యం సహాయంతో మీ శత్రువుల వల్ల కలిగే బాధలను వదిలించుకోవచ్చు అంటున్నారు. అయితే వాటికోసం కొన్ని పరిహారాలు చేయాలి అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

శత్రువులను శాంతింపజేయడానికి ఈ చర్యలను ఫాలో అవ్వండి..

* మీ శత్రువు మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడితే.. వారి వల్ల కలిగే ఇబ్బందులను వదిలించుకోవడానికి.. ఎర్ర చందనంతో.. భోజపత్రంపై ఆ వ్యక్తి పేరు రాయాలట. ఈ లేఖను తేనెలో నానబెట్టి ఉంచితే.. మీ శత్రువు స్వయంచాలకంగా శాంతిస్తాడు అంటారు.

* ఎవరైనా తన శత్రువును శాంతింపజేయాలనుకుంటే.. వాళ్లు 38 నల్ల ఉల్లి గింజలు, 40 బియ్యం గింజలను ఒక గోతిలో పూడ్చాలని.. దానిపై నిమ్మకాయను పిండాలని చెప్తారు. నిమ్మకాయను పిండేటప్పుడు మీ శత్రువు పేరును నిరంతరం జపిస్తూ ఉండండి. ఈ పరిహారం ప్రభావంతో.. మీ శత్రువు ప్రశాంతంగా ఉంటారు. మీకు హాని చేయరు.

* ఎవరైనా మిమ్మల్ని అనుసరిస్తూ.. మీకు ఏదైనా హాని చేయాలని ప్రయత్నిస్తున్నారని మీకు అనిపిస్తే.. ఆంజనేయ స్వామికి క్రమం తప్పకుండా బెల్లం లేదా బూందీని సమర్పించండి. ఇదేకాకుండా.. ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి.. ఎరుపు రంగు గులాబీ పువ్వును ఆయనకు సమర్పించి.. బజరంగ్ బాన్ పఠించండి.

* కొందరు రాత్రి, పగలు తేడా లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అలాంటివారి వల్ల మీకు ఎలాంటి హాని కలుగకుండా ఉండాలంటే.. మంగళవారం లేదా శనివారం.. నెమలి ఈకపై మీ శత్రువు పేరు రాసి.. ఈ నెమలి ఈకను మీ ఇంట్లోని పూజగదిలో ఉంచి.. ఉదయం నిద్రలేచిన వెంటనే.. స్నానం చేయకుండా.. ప్రవహించే నీటిలో వేసేయాలి. ఈ పరిహారం ద్వారా మీ శత్రువు త్వరలోనే శాంతిస్తాడు.

* మీ శత్రువుల బాధలు తొలగించుకోవడానికి.. శనివారం రాత్రి 7 లవంగాలను తీసుకొని మీ శత్రు నామాన్ని చెప్తూ.. వాటిని 21 సార్లు ఊదండి. మరుసటి రోజు ఆదివారం ఈ 7 లవంగాలను కాల్చండి. ఈ ఉపాయం 7 శనివారాలు నిరంతరంగా చేయాలి. ఈ ట్రిక్ తో ఒక వ్యక్తిని కూడా లొంగదీసుకోవచ్చట. ఈ ఉపాయంతో మీ శత్రువు కూడా ప్రశాంతంగా మారిపోతాడు.

* శత్రుబాధలు తొలగిపోవాలంటే సూర్యోదయానికి ముందు 'నృసింహాయ విద్యాహే, వజ్ర నకహే ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్' అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ప్రశాంతమైన, ఏకాంత ప్రదేశంలో ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని రోజూ పఠించడం వల్ల మీ శత్రువుల ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి.

ఇవి చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. అయితే వీటిని చేస్తేనే శత్రుబాధలు పోతాయనేది మా ఉద్దేశం కాదు. మీరు మీ శత్రువులతో మాట్లాడి కూడా మీ సమస్యలు క్లియర్ చేసుకోవచ్చు. వీటిని ట్రై చేస్తే.. ఈ సమస్య క్లియర్ అవుతుంది కదా అనుకుంటే వీటిని ఫాలో చేసేయండి. పెద్ద నష్టమేమి లేదు కదా.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

2024 సంవత్సర రాశి ఫలాలు

నూతన సంవత్సర రాశి ఫలాలు, పండగలు, శుభాకాంక్షలు ఇంకా మరెన్నో ఇక్కడ చదవండి.