Diamond: వజ్రం ఏ రాశి వాళ్ళు ధరిస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది.. ఎవరు దీన్ని ధరించకూడదు?-a diamond will double its luck if it is worn by any zodiac sign who should not wear it ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Diamond: వజ్రం ఏ రాశి వాళ్ళు ధరిస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది.. ఎవరు దీన్ని ధరించకూడదు?

Diamond: వజ్రం ఏ రాశి వాళ్ళు ధరిస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది.. ఎవరు దీన్ని ధరించకూడదు?

Gunti Soundarya HT Telugu
Jul 18, 2024 04:51 PM IST

Diamond: వజ్రం ఎవరు ధరించాలి? ఏ రాశి వాళ్ళు ధరిస్తే అదృష్టం రెట్టింపు అవుతుంది. ఏ రాశి జాతకులు దీన్ని ధరించకూడదు. ఇందుకోసం పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం.

వజ్రం ఏ రాశి వాళ్ళు ధరించాలి?
వజ్రం ఏ రాశి వాళ్ళు ధరించాలి? (pixabay)

Diamond: వజ్రం ధరించడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఇవి రిచ్ నెస్ ఇస్తాయి. మన అందాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. అయితే రత్నాలను ధరించేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. జ్యోతిష్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే ధరించాలి. తద్వారా అవి మీ జాతకంలో ఆ గ్రహాలను బలపరుస్తాయి. 

వజ్రాల ధరించడం ఫ్యాషన్ మాత్రమే కాదు ఇది సాంస్కృతికపరంగా, జ్యోతిష్య శాస్త్రంగా కూడా ప్రాముఖ్యత ఉంది. అయితే జ్యోతిష శాస్త్ర పరంగా వజ్రాలు ధరించేందుకు అనేక నియమాలు ఉన్నాయి. వజ్రం ధరించిన తర్వాత అది మనకు సరిపోతుందో లేదో ఎలా గుర్తించాలో మీరు తెలుసుకోవాలి. అన్నింటిలో మొదటిది ఏ రాశి వాళ్ళు వీటిని ధరించాలి? ఏ గ్రహం కోసం ధరించాలి అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి.

వజ్రం ధరించే ముందు ఇవి చేయాలి 

వజ్రం ధరించే ముందు దాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది శక్తులను గ్రహిస్తాయని కొందరు నమ్ముతారు. అందుకే వజ్రాన్ని ఉప్పు నీరు లేదా చంద్రుడి కాంతిలో ఉంచడం మంచిదిగా భావిస్తారు. అలాగే గ్రహాల సంచారం, నిర్దిష్ట రోజులు, సమయాల్లో మాత్రమే ఈ వజ్రాన్ని ధరించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. శుభ గ్రహాల అమరికల సమయంలో లేదా మీ రాశికి అనుకూలమైన రోజులలో వజ్రాలు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ధరించినప్పుడు మంత్రాలు పఠించడం, ధ్యానం చేయడం వల్ల వాటి శక్తి రెట్టింపు అవుతుందని అంటారు. ఏ రాశి వాళ్ళు వజ్రాలు ధరించవచ్చో తెలుసుకుందాం. 

మేష రాశి: మేష రాశి వారు ప్రతిష్టాత్మక స్వభావానికి ప్రసిద్ధి చెందారు. వజ్రాలు ధరించడం వల్ల వీరి నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. ఇవి వారి విశ్వాసాన్ని పెంచుతాయి. 

మిథున రాశి: మిథున రాశి జాతకులు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు వజ్రం సహాయపడుతుంది. అది మాత్రమే కాకుండా ఇది వారిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. 

మీన రాశి: మీన రాశి వారు కలలు ఎక్కువగా కంటారు. చాలా సహజమైన స్వభావంతో ఉంటారు. వజ్రాలు ధరించడం వల్ల ఈ రాశి వారు మానసిక సామర్థ్యాలు పెరుగుతాయి. అలాగే సృజనాత్మకత వ్యక్తీకరణ మెరుగుపడుతుందని నమ్ముతారు.

వృషభ రాశి: వృషభ రాశి వారు అందం లగ్జరీని ఇష్టపడతారు. వజ్రాలు వీరి గాంభీర్యం, ఆకర్షణను మరింత రెట్టింపు చేస్తాయి. 

తులా రాశి: తులా రాశి వారు వజ్రం ధరించవచ్చు. వజ్రం ధరించడం వల్ల ఇది దయాగుణం, సమతుల్యత పెంచుతుంది. మధ్యవర్తిత్వం నిర్వహించి అందరూ కలిసి ఉండేలా చేసే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. 

ధనుస్సు రాశి: ఈ రాశి జాతకులు సాహసోపేతమైన స్వభావం కలిగి ఉంటారు. నిజాలు మాట్లాడేందుకే ఇష్టపడతారు. అటువంటి ఈ రాశి జాతకులు వజ్రాలు ధరించడం వల్ల వారి అంతర్దృష్టి, జ్ఞానం మెరుగుపడుతుంది. 

కుంభ రాశి: కుంభ రాశి వినూత్న ఆలోచన, మానవతా దృక్పథానికి ప్రసిద్ధి చెందారు. వజ్రాలు వారి ప్రత్యేకమైన ఆలోచనలను మరింత ప్రభావవంతమైన పద్ధతిలో స్పష్టతతో వ్యక్తీకరించడంలో సహాయపడతాయి.

సింహ రాశి: సింహ రాశి జాతకులకు నాయకత్వ స్వభావం ఎక్కువ. వజ్రాలు వారి రాజశాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తాయి. ఇతరులను ఆకర్షించేందుకు ప్రభావంతంగా పనిచేస్తాయి. 

డైమండ్ మీకు సరిపోతుందో లేదో ఎలా చెక్ చేయాలి?

అన్నింటిలో మొదటిది మీరు హోదా కోసం లేదా ఎవరికైనా చూపించడానికి వజ్రం ధరించినట్లయితే ఇది అస్సలు చేయకూడదని తెలుసుకోండి. ఇది మీకు హాని చేస్తుంది. 21 ఏళ్ల తర్వాత వజ్రాన్ని ధరించాలి. మీరు వజ్రం ధరించి ఉంటే ఆ వజ్రం మీకు సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. 

వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే వజ్రం ధరించడం మానుకోవాలి. వజ్రం ధరించిన తర్వాత 20-25 రోజులలో దాని ప్రభావాలను చూపడం ప్రారంభిస్తుంది.  ఈ కాలంలో మీకు ఏదైనా జరిగితే వజ్రం మీకు సరిపోదని అర్థం చేసుకోండి. మీరు విరిగిన వజ్రాన్ని ధరిస్తే ఆర్థికంగా నష్టపోవచ్చు. ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. మీకు పరువు నష్టం కూడా సంభవిస్తుంది.

ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

Whats_app_banner