Diamonds: ఈ రాశుల వాళ్ళు వజ్రం ధరిస్తే సమస్యలు ఎదురవుతాయి
Diamond: మీ అందాన్ని మరింత పెంచుకోవడం కోసం వజ్రాలు ధరిస్తారు. కానీ కొన్ని రాశుల వారికి వజ్రాలు దురదృష్టం కలిగిస్తాయి.
Diamond: పురాతన కాలం నుంచి విభిన్న సంస్కృతులకి చెందిన ప్రజలు రత్నాలు ధరించేవాళ్ళు. వజ్రాలు ధరించడం వల్ల హుందాగా, ఆకర్షణీయంగా కనిపినస్తారు. బంగారం, వెండి ఆభరణాల మాదిరిగానే వజ్రాలు కూడా ధరిస్తారు. రత్నాలన్నీ ఏదో ఒక గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 రత్నాలు, 84 ఉప రత్నాలు ఉన్నాయి. ఈ తొమ్మిది రత్నాలు నవ గ్రహాలకి ప్రతీకగా ఉంటాయి. నెగిటివిటీని ఎదుర్కోవడంలో వజ్రాలు బాగా పని చేస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రత్నాలు ధరిస్తే శుభమే కాదు అశుభం కూడా జరుగుతుంది.
వజ్రం ఖరీదైనది, ఆకర్షణీయంగా ఉంటుంది. వజ్ర రత్నం శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. వజ్రాలు ఆధ్యాత్మిక స్పష్టతని మెరుగుపరుస్తాయని భావిస్తారు. వజ్రం ధరించడం వల్ల వారి జాతకంలో శుక్రుని స్థానం బలపడుతుంది. జ్యోతిష్యులని సంప్రదించకుండా రత్నాన్ని ధరించకూడదు. గ్రహ నక్షత్రం, రాశి ప్రకారం ఎటువంటి రత్నం ధరించాలనేది జ్యోతిష్యులు సలహా ఇస్తారు. ఈ రాశుల వారు వజ్రం ధరించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
మేష రాశి
ఈ రాశి వ్యక్తుల జాతకంలో రెండు లేదా ఏడో ఇంటికి శుక్రుడు అధిపతిగా ఉన్నప్పుడు వాళ్ళు వజ్రాలు ధరించకూడదు. మేష రాశి వ్యక్తులు ఉద్రేకపూరిత స్వభావం కలిగి ఉంటారు. వజ్రాలు ప్రశాంతత లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ రెండు వ్యతిరేక స్వభావాలు కావడం వల్ల ఈ రాశి వారు వజ్రాలు ధరించకపోవడం ఉత్తమం. వజ్రం ధరించడం జీవితంలో అనేక సమస్యలు, సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి వజ్రం శుభప్రదంగా ఉండకపోవచ్చు. కానీ జాతకం ప్రకారం శుక్రుని మహాదశ నడుస్తున్నప్పుడు వజ్రాన్ని ధరించవచ్చు. అయితే మీరు ఆ పని చేసే ముందు జ్యోతిష్యుడిని సంప్రదించడం మంచిది.
సింహ రాశి
ఈ రాశి ఉన్న జాతకులు వజ్రం ధరించడం అంత మంచిది కాదు. వజ్రాలు ధరించడం వల్ల సింహ రాశి వాళ్ళు మంచికి బదులు చెడు ఎదురవుతుంది. హుందా కోసం వజ్రం ధరించే అది ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిని పాలించే గ్రహం కుజుడు. అంగారకుడు, శుక్రుని మధ్య శత్రు భావం ఉంటుంది. వజ్రం ధరిస్తే ఇతరులతో విభేదాలు, అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఈ రాశి వాళ్ళు కూడా వజ్రాలు ధరించడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి.
మీన రాశి
శుక్రుడు మీనంలో మూడు, ఎనిమిది గృహాలకి అధిపతిగా ఉంటాడు. మీన రాశికి అధిపతి దేవ గురువు బృహస్పతి. దేవుళ్ళకి బృహస్పతి అధిపతి అయితే శుక్ర గ్రహం రాక్షసులకి అధిపతిగా చెప్తారు. ఈ రెండింటి మధ్య వ్యతిరేక భావాలు ఉంటాయి. అందుకే ఈ రాశి కలిగిన జాతకులు కూడా వజ్రం ధరించాలని అనుకోవడం సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. వజ్రాలు ధరిస్తే దురదృష్టం, నెగటివ్ ఎనర్జీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
టాపిక్