YS Jagan in Pithapuram : పిఠాపురంలో వైఎస్ జగన్ - వరద బాధితులకు పరామర్శ
- YS Jagan Visits Floods Affected Areas : వైసీపీ అధినేత జగన్ పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మాధవపురం, ఇసుకపల్లి,నాగులపల్లితో పాటు మరికొన్ని గ్రామాల్లోని వరద బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

(2 / 6)
ఇసుకపల్లి,నాగులపల్లిలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. రైతులు నీట మునిగిన వరి నాట్లను జగన్‌కు చూపిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు
(4 / 6)
ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదంటూ రైతులు తమ సమస్యలన జగన్ దృష్టికి తీసుకెళ్లారు. పాడైన వరి నారును చుపుతూ వారి గోడును వినిపించారు.
(5 / 6)
వైసీపీ అధినేత జగన్ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. జగన్ వెంట నియోజకవర్గ ఇంఛార్జ్ వంగా గీతతోపాటు పలువురు నాయకులు ఉన్నారు.
(6 / 6)
ఏలేరు వరదతో పంట మొత్తం నాశనం అయిపోయిందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్… ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుందని విమర్శించారు. వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉందని… ఏలేరు రిజర్వాయర్‌కి వచ్చే ఇన్‌ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదని ప్రశ్నించారు.
ఇతర గ్యాలరీలు