WPL 2024: డబ్ల్యూపీఎల్‍లో ఈ మార్క్ దాటిన తొలి ప్లేయర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్
- WPL 2024 - Meg Lanning: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ ల్యానింగ్ ఓ రికార్డు సృష్టించారు. ఈ టోర్నీలో ఓ మార్క్ దాటిన తొలి ప్లేయర్‌గా ఈ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికార్డులకెక్కారు. ఆ వివరాలు ఇవే..

(1 / 5)
అంతర్జాతీయ మహిళల క్రికెట్‍లో చాలా రికార్డును నెలకొల్పిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ ల్యానింగ్.. ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లోనూ సత్తాచాటుతున్నారు. తాజాగా ఓ ఘనతను తన పేరిట లిఖించుకున్నారు. (PTI)
(2 / 5)
డబ్ల్యూపీఎల్ చరిత్రలో 500 పరుగుల మార్క్ దాటిన తొలి ప్లేయర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ ల్యానింగ్ రికార్డు సష్టించారు. (PTI)
(3 / 5)
నేడు (మార్చి 5) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‍లో 53 పరుగులతో హాఫ్ సెంచరీ చేసిన ఢిల్లీ బ్యాటర్ ల్యానింగ్.. డబ్ల్యూపీఎల్‍లో 500 పరుగులను దాటారు. ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూపీఎల్ రెండో ఎడిషన్‍లో ల్యానింగ్ అదరగొడుతున్నారు. (PTI)
(4 / 5)
ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూపీఎల్ 2024 సీజన్‍లో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేస్‍లో ఉన్నారు ల్యానింగ్. ఈ ఏడాది ఇప్పటి వరకు 5 మ్యాచ్‍ల్లో 201 రన్స్ చేశారు ల్యానింగ్. గతేడాది తొలి డబ్ల్యూపీఎల్ ఎడిషన్‍లో 345 రన్స్ చేసి.. ఆరెంజ్ క్యాంప్ దక్కించుకున్నారు ల్యానింగ్. (PTI)
ఇతర గ్యాలరీలు