Winter Special Teas । చలికాలంలో ఇలాంటి చాయ్ వెరైటీలు తాగండి.. ఆరోగ్యంగా ఉంటారు!-winter special teas to keep you warm and healthy during the cold season ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Winter Special Teas । చలికాలంలో ఇలాంటి చాయ్ వెరైటీలు తాగండి.. ఆరోగ్యంగా ఉంటారు!

Winter Special Teas । చలికాలంలో ఇలాంటి చాయ్ వెరైటీలు తాగండి.. ఆరోగ్యంగా ఉంటారు!

Nov 21, 2022, 09:57 AM IST HT Telugu Desk
Nov 21, 2022, 09:57 AM , IST

  • Winter Special Teas: చలికాలం మొదలైంది. వణికించే చలిలో వేడివేడి టీ తాగనిదే ఏ పని చేయాలనిపిచదు. అయితే చలికాలంలో కొన్ని ప్రత్యేకమైన చాయ్ లను తాగటం ద్వారా సీజనల్ ఆనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. ఎలాంటి టీలు తాగాలో చూడండి.
  •  

చలికాలం చాలా స్పెషల్, మరి ఈ స్పెషల్ కాలంలో స్పెషల్ టీలు తాగకుండా ఎలా? సాధారణంగా మనం రోజూ తాగే టీలు కాకుండా కొన్ని ఔషధ గుణాలు కలిగిన టీ వెరైటీలు ఇక్కడ తెలియజేస్తున్నాం.

(1 / 10)

గ్రీన్ టీ: గ్రీన్ టీ అత్యంత ప్రజాదరణ పొందిన టీలలో ఒకటి. గ్రీన్ టీ తాగడం వల్ల మీ రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి పెరుగుతుంది. ఇది మన శరీర పనితీరును మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

(2 / 10)

ఊలాంగ్ టీ: ఇది చైనీస్ టీ రకం. సాధారణంగా చైనీస్ రెస్టారెంట్లలో కనిపిస్తుంది. గ్రీన్ టీ, బ్లాక్ టీల కంటే ఊలాంగ్ టీలో బలమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ మ్యుటాజెనిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.

(3 / 10)

వైట్ టీ: ఇది ఇతర టీల కంటే స్వచ్ఛమైనది, తక్కువ ప్రాసెస్ చేసినది. సహజమైన రుచిని కలిగ్ ఉంటుంది. ఈ టీని సంవత్సరానికి ఒకసారి వసంతకాలంలో సూర్యోదయానికి ముందు ఉదయం 3 నుండి 5 గంటల మధ్య ఎంచుకొని ప్యాక్ చేస్తారు. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

(4 / 10)

హెర్బల్ టీ: హెర్బల్ టీలలో ఆరోగ్యానికి చాలా మేలు చేసే మూలికలను ఉపయోగిస్తారు. ఇవి వివిధ ఔషధ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. ఇలాంటి టీలు రుచిలోనూ అద్భుతంగా ఉంటాయి. హెర్బల్ టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది, అనవసరమైన కొవ్వును తొలగిస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

(5 / 10)

మేట్ టీ: కాఫీ ప్రియులు కూడా ఇష్టంగా తాగే టీ ఏదైనా ఉందా అంటే అది మేట్ టీ. ఎందుకంటే ఈ టీ కూడా కాఫీ రుచిని కలిగి ఉంటుంది. . మేట్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పవర్ గ్రీన్ టీ కంటే కొంచెం ఎక్కువ. మద్యపాన అలవాటు నుండి బయటపడటానికి ఈ టీ తాగాలి.

(6 / 10)

రూయిబోస్ టీ: ఇది దక్షిణాఫ్రికాలోని ఎర్రటి మొక్క నుండి తయారైన హెర్బల్ టీ. రూయిబోస్ టీ రక్తపోటును నియంత్రించే ఎంజైమ్ యాంజియోటెన్సిన్ విడుదలను నిరోధించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

(7 / 10)

బ్లూమింగ్ టీ: ఇది కూడా ఒక హెర్బల్ టీ . ప్రత్యేక రకాల పూలను ఎండబెట్టి ఈ టీని తయారుచేస్తారు. పుష్పించే టీలో పాలీఫెనాల్స్ అనే ప్రత్యేక సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది, ఇది ఇతర టీల కంటే బలమైన సువాసనను ఇస్తుంది. ఈ మిశ్రమం చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది.

(8 / 10)

బ్లాక్ టీ: డికాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు గ్రామీణ ప్రజలు సాధారణంగా బ్లాక్ టీనే తాగేవారు. తర్వాత ఆ బ్లాక్ టీలు పాలు కలుపుకొని తాగడం ప్రారంభమైంది. అయితే బ్లాక్ టీ వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. చలికాలంలో తాగితే మంచిది.

(9 / 10)

సంబంధిత కథనం

రోజ్ గ్రీన్ టీBlack Pepper TeaTurmeric Tea RecipeCoriander Leaves TeaInstant Masala Tea Recipe
WhatsApp channel

ఇతర గ్యాలరీలు