తెలుగు న్యూస్ / ఫోటో /
Baby's first hair cut: పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడానికి సరైన వయసు ఏది? ఆ వయసులోపే తీస్తే ప్రమాదమే
Baby's first hair cut: పుట్టిన తర్వాత బిడ్డకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయించాలనే సందేహం ఉందా? దీనిగురించి వైద్యులు ఏమంటున్నారో తెల్సుకోండి.
(1 / 6)
హిందూమతంలో శిశువు ఎదుగుతూ ఉంటే ఒక్కో వయసులో చేయాల్సిన ఆచారాలు కొన్నుంటాయి. వాటిలో కేశ ఖండనం లేదా పుట్టు వెంట్రుకలు తీయడం కూడా ఒకటి. శాస్త్రాల ప్రకారం ప్రతి వ్యక్తికి పుట్టిన తర్వాత 16 సంస్కారాలు చేస్తారు.ఈ 16 ఆచారాలలో శిరోముండనం ఒకటి.
(2 / 6)
శాస్త్రాల ప్రకారం పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం చాలా ముఖ్యం. దీని వల్ల పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. అలాగే పిల్లల వెంట్రుకలు తీయడం వల్ల జుట్టు మందంగా, మెరుగ్గా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
(3 / 6)
అయితే పిల్లకు కేశ ఖండనం ఏ వయసులో చేయాలి? ఏ వయసు దానికి సముచితం అనే సందేహాలుంటే వివరంగా తెల్సుకోండి.
(4 / 6)
కొన్ని కుటుంబాల్లో పుట్టిన ఏడాదిలోపే పుట్టు వెంట్రుకలు తీస్తే, మరికొందరు మూడేళ్ల వయసులోనే కేశ ఖండనం చేస్తారు.(pixel)
(5 / 6)
శిశువు పుట్టు వెంట్రుకలు తీయడానికి సరైన వయస్సు 1 నుండి 3 సంవత్సరాలు, ఈ సమయంలో శిశువు యొక్క తలలోని వెంట్రుకల కుదుళ్ల దగ్గర గ్రంథులు మూసుకుపోతాయి. కాబట్టి జుట్టు కత్తిరించడంలో ఎటువంటి సమస్య ఉండదని వైద్యులు చెబుతున్నారు.
ఇతర గ్యాలరీలు