తెలుగు న్యూస్ / ఫోటో /
Polavaram : పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం
- Polavaram : పోలవరం ప్రాజెక్టును ఆదివారం అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు ఇవాళ ఉదయం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని, సమగ్ర అధ్యయనం చేస్తున్నారు.
- Polavaram : పోలవరం ప్రాజెక్టును ఆదివారం అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు ఇవాళ ఉదయం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని, సమగ్ర అధ్యయనం చేస్తున్నారు.
(1 / 6)
ఏపీలో పోలవరం వద్ద గోదావరి నదిపై భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు మొదలుపెట్టింది.
(2 / 6)
పోలవరం ప్రాజెక్టును ఆదివారం అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు ఇవాళ ఉదయం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు.
(3 / 6)
పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న అంతర్జాతీయ నిపుణులు అక్కడి పరిసరాలను పరిశీలించారు. స్థానిక అధికారులతో మాట్లాడారు.
(4 / 6)
అమెరికా నుంచి డేవిడ్ పి పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్ పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులు పనుల తీరు, ప్రాజెక్టు నిర్మాణం గురించి నిపుణులకు తెలిపారు.
(5 / 6)
పోలవరం డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్‌లను అంతర్జాతీయ నిపుణులు పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టు డిజైన్లపై నిపుణులు సమగ్ర అధ్యయనం చేయనున్నారు.
ఇతర గ్యాలరీలు