తెలుగు న్యూస్ / ఫోటో /
TS Inter Results 2024 : కసరత్తు పూర్తి.... తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..?
- TS Intermediate Results 2024 Updates : తెలంగాణ ఇంటర్ ఫలితాలు(TS Inter Results 2024) విడుదల కాబోతున్నాయి. ఆ దిశగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. వచ్చే వారం ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రాథమికంగా తేదీలను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. తాజా అప్డేట్స్ కూడా ఇక్కడ చూడండి….
- TS Intermediate Results 2024 Updates : తెలంగాణ ఇంటర్ ఫలితాలు(TS Inter Results 2024) విడుదల కాబోతున్నాయి. ఆ దిశగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. వచ్చే వారం ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రాథమికంగా తేదీలను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. తాజా అప్డేట్స్ కూడా ఇక్కడ చూడండి….
(1 / 6)
ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 9 లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్(Telangana Inter Results) ఎప్పుడు వస్తాయనేది ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు.(photo source from unsplash.com)
(2 / 6)
తెలంగాణ ఇంటర్ స్పాట్ ఇప్పటికే పూర్తి అయింది. ఇదే కాకుండా మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతికపరమైన అంశాల పరిశీలన కూడా పూర్తి అయినట్లు తెలిసింది. దీంతో ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.(photo source from unsplash.com)
(3 / 6)
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 22వ(సోమవారం) తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఈ తేదీ మిస్ అయితే… ఏప్రిల్ 23వ తేదీన ఇవ్వొచ్చు.(photo source from unsplash.com)
(4 / 6)
ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 25వ తేదీలోపే ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 22 లేదా 23వ తేదీన ప్రకటించే ఛాన్స్ ఉంది.(photo source from unsplash.com)
(5 / 6)
ఇంటర్ బోర్డు విడుదల చేసిన క్షణాల వ్యవధిలోనే HT తెలుగు సైట్ లో మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై క్లిక్ చేసి మీ రిజల్ట్స్ ను చూడొచ్చు. ఫస్ట్ ఇయర్, సెకండర్ ఇయర్ తో పాటు ఒకేషన్ కోర్సుల ఫలితాలను కూడా చెక్ చేసుకోవచ్చు.(photo source from unsplash.com)
(6 / 6)
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు సైట్ https://tsbie.cgg.gov.in/home.do లోనూ చెక్ చేసుకోవచ్చు. ఈసారి తెలంగాణ ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు. ఇందులో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉండగా... 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులంతా ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు.(photo source from unsplash.com)
ఇతర గ్యాలరీలు