తెలుగు న్యూస్ / ఫోటో /
Karimnagar Cable Bridge : కరీంనగర్ సిగలో తీగల మణిహారం - అదిరిపోయే ఈ ఫొటోలు చూడండి
- Karimnagar Cable Bridge Photos : కరీంనగర్ తీగల వంతెన సిద్ధమైంది. బుధవారం మంత్రి కేటీఆర్ ఈ వంతెనను ప్రారంభించనున్నారు. లోయర్ మానేరు తీరాన నిర్మించిన ఈ వంతెనకు... సంబంధించిన వీడియో దృశ్యాలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
- Karimnagar Cable Bridge Photos : కరీంనగర్ తీగల వంతెన సిద్ధమైంది. బుధవారం మంత్రి కేటీఆర్ ఈ వంతెనను ప్రారంభించనున్నారు. లోయర్ మానేరు తీరాన నిర్మించిన ఈ వంతెనకు... సంబంధించిన వీడియో దృశ్యాలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
(1 / 7)
కరీంనగర్ మీదుగా వరంగల్‌కు వెళ్లే ప్రయాణికులకు దూరాభారం తగ్గించడం లక్ష్యంగా ఈ వంతెనను నిర్మించారు. ట్రాఫిక్ రద్దీ లేకుండా చేసేందుకు రూ.224 కోట్ల వ్యయంతో ఈ వంతెన పనులు పూర్తి చేశారు.(twitter)
(2 / 7)
2018 ఫిబ్రవరి 19న ఈ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. -26 పొడవైన స్టీల్ కేబుల్స్ ఇందులో ఉన్నాయి. వీటిని ఇటలీ నుంచి తెప్పించారు. రూ.8 కోట్లతో కొరియా డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. (twitter)
(3 / 7)
రోడ్డుకు ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయగా... టాటా కంపెనీ సారథ్యంలో నిర్మాణ పనులు కొనసాగాయి. (twitter)
(4 / 7)
రూ.183 కోట్ల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి వంతెనకు అంచనా వ్యయం వేసినప్పటికీ... రూ.224 కోట్ల వరకు చేరింది.(twitter)
(5 / 7)
ఈ వంతెన నిర్మాణం ద్వారా... జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, సిరిసిల్ల తదితర జిల్లాల నుంచి కరీంనగర్ మానేరు వంతెన రహదారి మీదుగా వరంగల్, విజయవాడకు వెళ్లే వారికి ప్రయాణ భారంతోపాటు ట్రాఫిక్ రద్ధీ కూడా తగ్గనుంది.(twitter)
(6 / 7)
తీగల వంతెన 500 మీటర్లు.. కరీంనగర్ కమాన్ నుంచి వంతెన వరకు 300 మీటర్లు, సదాశివపల్లి వైపు 500 మీటర్ల దూరంలో నాలుగు వరుసల రహదారి పనులు పూర్తయ్యాయి. ఈ వంతెనకు అనుబంధంగా అప్రోచ్ రోడ్లు నిర్మించారు.(twitter)
ఇతర గ్యాలరీలు