తెలుగు న్యూస్ / ఫోటో /
Tirumala : తిరుమలలో కన్నుల పండుగగా చక్రస్నానం
- Tirumala : తిరుమలలో తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు శ్రీవారికి స్నపనతిరుమంజనం అనంతరం చక్రస్నానం నిర్వహించారు.
- Tirumala : తిరుమలలో తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజు శ్రీవారికి స్నపనతిరుమంజనం అనంతరం చక్రస్నానం నిర్వహించారు.
(1 / 7)
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది.
(5 / 7)
ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
(6 / 7)
స్నపనతిరుమంజనంలో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.
ఇతర గ్యాలరీలు