తెలుగు న్యూస్ / ఫోటో /
Tirumala Garuda Vahana Seva : గరుడ వాహనంపై తిరుమలేశుడు విహారం, భక్త జనసంద్రమైన తిరుమల
- Tirumala Garuda Vahana Seva : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు,కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తనకు ఎంతో ఇష్టమైన గరుత్మంతునిపై తిరుమాడవీధుల్లో విహరించారు. మంగళవారం సాయంత్రం గరుడవాహనంపై వైకుంఠ నాథుడు విహరించాడు.
- Tirumala Garuda Vahana Seva : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు,కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తనకు ఎంతో ఇష్టమైన గరుత్మంతునిపై తిరుమాడవీధుల్లో విహరించారు. మంగళవారం సాయంత్రం గరుడవాహనంపై వైకుంఠ నాథుడు విహరించాడు.
(1 / 6)
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు,కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తనకు ఎంతో ఇష్టమైన గరుత్మంతునిపై తిరుమాడవీధుల్లో విహరించారు. మంగళవారం సాయంత్రం గరుడవాహనంపై వైకుంఠ నాథుడు విహరించాడు. లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణ తిరుగిరుల్లో మారుమోగాయి. (ttd)
(2 / 6)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ సేవకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. గరుడవాహనం మాడవీధుల్లో విహరిస్తుంటే గోవిందా నామస్మరణ మారుమోగింది.(ttd)
(3 / 6)
గరుడసేవ జరగడంతో లక్షలాది మంది భక్తులకు తిరుమల స్వర్గధామం అవుతుంది. గరుడ వాహనం దేవత మరియు అతని అనుచరుల మధ్య దైవిక బంధాన్ని సూచిస్తుంది కాబట్టి గాలి "గోవిందా...గోవిందా" అని ప్రతిధ్వనిస్తుంది.
(4 / 6)
గరుడ సేవలో మూల విరాట్‌కు అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, శ్రీవేంకటేశ్వర సహస్రమాల, ఇతర ఆభరణాలను ఉత్సవమూర్తిని అలంకరిస్తారు. గరుడునిపై మలయప్పస్వామిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. (ttd)
(5 / 6)
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎంతో ఘనమై గరుడ వాహనసేవను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకున్నారు. బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తుల కోసం టీటీడీ గ్యాలరీలు ఏర్పాటు చేసింది. (ttd)
ఇతర గ్యాలరీలు