తెలుగు న్యూస్ / ఫోటో /
Tirumala Leopard : తిరుమల నడక మార్గంలో చిరుతల కలకలం, భయాందోళనలో భక్తులు!
- Tirumala Leopard : తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలోని ఆఖరి మెట్లు వద్ద రెండు చిరుతలు భక్తులకు కనిపించాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో పెద్దగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో రెండు చిరుతలు అడవిలోకి పారిపోయాయి.
- Tirumala Leopard : తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలోని ఆఖరి మెట్లు వద్ద రెండు చిరుతలు భక్తులకు కనిపించాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో పెద్దగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో రెండు చిరుతలు అడవిలోకి పారిపోయాయి.
(1 / 6)
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలోని ఆఖరి మెట్లు వద్ద రెండు చిరుతలు భక్తులకు కనిపించాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో పెద్దగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో రెండు చిరుతలు అడవిలోకి పారిపోయాయి.
(2 / 6)
అలిపిరి మెట్ల మార్గంలో చిరుతల సంచారంపై సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. చిరుతల జాడలను గుర్తించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
(3 / 6)
భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
(4 / 6)
ఐదు రోజుల క్రితం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుతను భక్తులు చూశారు. తెల్లవారుజామున భక్తులు వెళ్తున్న కారుకు చిరుత అడ్డువచ్చింది. ఈ దృశ్యాలు కారు డాష్ కెమెరాలో రికార్డు అయ్యాయి.
(5 / 6)
గతేడాది అలిపిరి కాలి నడక మార్గంలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలతో టీటీడీ, అటవీ అధికారులు అప్రమత్తమై ట్రాప్ కెమెరాలు, బోను పెట్టి చిరుతలను బంధించారు. కొంత కాలం చిరుతల సంచారం తగ్గినా ఇటీవల మళ్లీ చిరుతల సంచారం కనిపిస్తుంది.
ఇతర గ్యాలరీలు