Thyroid Tips: థైరాయిడ్ ఉన్న వారికి బెస్ట్ స్నాక్స్ ఇవి, ఆ సమస్య అదుపులో ఉంటుంది-these are the best snacks for those with thyroid and that problem is under control ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Thyroid Tips: థైరాయిడ్ ఉన్న వారికి బెస్ట్ స్నాక్స్ ఇవి, ఆ సమస్య అదుపులో ఉంటుంది

Thyroid Tips: థైరాయిడ్ ఉన్న వారికి బెస్ట్ స్నాక్స్ ఇవి, ఆ సమస్య అదుపులో ఉంటుంది

May 24, 2024, 10:11 AM IST Haritha Chappa
May 24, 2024, 10:11 AM , IST

Thyroid Tips: శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంచేందుకు, ఇతర శారీరక విధులను నియంత్రించడానికి  థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలు తింటే మంచిది.

ఈ స్నాక్స్ మీ థైరాయిడ్ కు చాలా ఆరోగ్యకరమైనవి. ఇనుమును పెంచడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, బరువును నియంత్రించడానికి, హార్మోన్లను సమతుల్యం చేయడానికి,  తీపి కోరికలను అరికట్టడానికి ఇది సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

(1 / 8)

ఈ స్నాక్స్ మీ థైరాయిడ్ కు చాలా ఆరోగ్యకరమైనవి. ఇనుమును పెంచడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, బరువును నియంత్రించడానికి, హార్మోన్లను సమతుల్యం చేయడానికి,  తీపి కోరికలను అరికట్టడానికి ఇది సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.(Pinterest)

కాల్చిన శనగలు తేలికగా జీర్ణం అవుతాయి. వీటిలో ఐరన్ కంటెంట్ ను పెంచి ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎక్కువ శక్తిని అందిస్తాయి.

(2 / 8)

కాల్చిన శనగలు తేలికగా జీర్ణం అవుతాయి. వీటిలో ఐరన్ కంటెంట్ ను పెంచి ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎక్కువ శక్తిని అందిస్తాయి.(Pixabay)

పెసరపప్పులో  శాకాహార ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గిస్తుంది, అయోడిన్,  ఫైబర్ అధికంగా ఉంటుంది.

(3 / 8)

పెసరపప్పులో  శాకాహార ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గిస్తుంది, అయోడిన్,  ఫైబర్ అధికంగా ఉంటుంది.(Pixabay)

సంతానోత్పత్తికి, గుండె ఆరోగ్యానికి, పొట్ట ఆరోగ్యానికి దానిమ్మ గొప్పగా సహాయపడుతుంది. వారానికి కనీసం మూడు సార్లు స్నాక్స్ గా తినడం వల్ల మీ జుట్టు, పొట్ట, ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

(4 / 8)

సంతానోత్పత్తికి, గుండె ఆరోగ్యానికి, పొట్ట ఆరోగ్యానికి దానిమ్మ గొప్పగా సహాయపడుతుంది. వారానికి కనీసం మూడు సార్లు స్నాక్స్ గా తినడం వల్ల మీ జుట్టు, పొట్ట, ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.(Pixabay)

ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారం బెల్లం కొబ్బరి లడ్డూలు. ఇది మీ శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది.

(5 / 8)

ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారం బెల్లం కొబ్బరి లడ్డూలు. ఇది మీ శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది.(Pinterest)

కొబ్బరి నీరు ఒక అద్భుతమైన ఎలక్ట్రోలైట్, ఇది రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.

(6 / 8)

కొబ్బరి నీరు ఒక అద్భుతమైన ఎలక్ట్రోలైట్, ఇది రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.(Wikipedia)

 ఉసిరిలో యాంటీఆక్సిడెంట్స్,  విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శక్తిని పెరగడం,  జుట్టు రాలడాన్ని తగ్గించడం,  చర్మాన్ని మెరిపించడం వంటివి కలుగుతాయి.

(7 / 8)

 ఉసిరిలో యాంటీఆక్సిడెంట్స్,  విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శక్తిని పెరగడం,  జుట్టు రాలడాన్ని తగ్గించడం,  చర్మాన్ని మెరిపించడం వంటివి కలుగుతాయి.

పిస్తాపప్పులో మెలటోనిన్ అధికంగా ఉంటుంది. ఇది మీ నిద్రను మెరుగుపరుస్తుంది.

(8 / 8)

పిస్తాపప్పులో మెలటోనిన్ అధికంగా ఉంటుంది. ఇది మీ నిద్రను మెరుగుపరుస్తుంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు