తెలుగు న్యూస్ / ఫోటో /
Southwest Monsoon 2024 Updates : ఐఎండీ చల్లని కబురు - ఏపీలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం ఎప్పుడంటే...?
- IMD Southwest Monsoon 2024 Updates : భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మే 19న అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించే సమయంపై కీలక ప్రకటన చేసింది. ఐఎండీ తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి......
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 7)
మే 19న అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించే సమయంపై కీలక ప్రకటన చేసింది. (photo source https://unsplash.com/)
(2 / 7)
మే నెలాఖరులో కేరళను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ గురువారం తెలిపింది. (photo source https://unsplash.com/)
(3 / 7)
కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఏపీలోకి రుతుపవనాల ప్రవేశం ఉంటుందని పేర్కొంది. ఐఎండీ అంచనాల ప్రకారం….జూన్ తొలి వారంలో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. (photo source https://unsplash.com/)
(4 / 7)
మరోవైపు ఉపరితల ఆవర్తనం ,ద్రోణి ప్రభావంతో కేరళ, తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీకి వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. ఇవాళ, రేపు కోస్తాంధ్ర, సీమ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది..(photo source https://unsplash.com/)
(5 / 7)
గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 2015లో మినహా గత 19 ఏళ్లలో (2005-2023) రుతుపవనాలు ప్రవేశించే తేదీపై ఐఎండీ అంచనాలు సరైనవి గానే తేలాయని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది(photo source https://unsplash.com/)
(6 / 7)
రుతుపవనాలు ఉత్తరం వైపుకు పురోగమిస్తున్నప్పుడు మండే వేసవి ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా జూలై 15 నాటికి దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతాయి.(photo source https://unsplash.com/)
ఇతర గ్యాలరీలు