తెలుగు న్యూస్ / ఫోటో /
TTD Chairman Issue: కొలిక్కి రాని టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యుల నియామకం..అంతు చిక్కని చంద్రబాబు అంతరంగం
- TTD Chairman Issue: కోట్లాది భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో అక్రమాలు, అవినీతి జరిగిందంటూ రాజకీయ విమర్శలు చెలరేగుతున్న వేళ టీటీడీ నిర్వహణకు పాలక మండలి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే టీటీడీ ఛైర్మన్,పాలక మండలి ఏర్పాటవుతుందనుకున్నా జాప్యం జరుగుతోంది.
- TTD Chairman Issue: కోట్లాది భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో అక్రమాలు, అవినీతి జరిగిందంటూ రాజకీయ విమర్శలు చెలరేగుతున్న వేళ టీటీడీ నిర్వహణకు పాలక మండలి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే టీటీడీ ఛైర్మన్,పాలక మండలి ఏర్పాటవుతుందనుకున్నా జాప్యం జరుగుతోంది.
(1 / 8)
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థైన తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి లేకుండానే నాలుగు నెలలుగా పాలన సాగుతోంది.
(2 / 8)
టీటీడీ పాలక మండలి ఏర్పాటుపై రకరకాల ప్రచారాలు, ఊహాగానాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మనసులో ఏముందో మాత్రం ఎవరికి అంతుచిక్కడం లేదు. ఎన్డీఏ కూటమి పార్టీల అభిప్రాయం ఏమిటో కూడా బయటకు పొక్కడం లేదు.
(3 / 8)
కోట్లాది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారి పాలకమండలిలో చోటు దక్కడమే అరుదైన గౌరవంగా భావిస్తారు. టీటీడీ ఛైర్మన్ పదవి కోసం టీడీపీ నాయకుల్లో తీవ్రమైన పోటీ ఉంది. మరోవైపు బీజేపీ, జనసేన నాయకుల్లో కూడా టీటీడీ పదవులపై కన్నేశాయి.
(4 / 8)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నియామకం విషయంలో ఎంపికల ప్రక్రియ కొలిక్కి రాలేదు. టీటీడీ ఛైర్మన్ పదవి విషయంలో ఎవరికి భరోసా ఇచ్చే పరిస్థితి లేనందున, అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ఛైర్మన్, పాలక మండలిని ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
(5 / 8)
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బాధ్యతల్ని ఎవరికి అప్పగిస్తారనే దానిపై రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు నామినేటెడ్ పదవుల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. టీటీడీ ఛైర్మన్ సహా కీలక పదవుల్లో తమకు భాగస్వామ్యం ఉండాలని బీజేపీ కోరుతోంది.
(6 / 8)
టీటీడీ నిర్వహించే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ముందే టీటీడీ పాలక మండలి నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా అవి ఎంత మేరకు కొలిక్కి వస్తాయో స్పష్టత లేదు. ఛైర్మన్, బోర్డు సభ్యులు సహా 23మందికి పాలకమండలిలో చోటు దక్కుతుంది. పార్టీల బలాబలాలు, సీట్ల కేటాయింపు ఆధారంగా చూస్తే బీజేపీకి 2, జనసేనకు 5కు మించి టీటీడీ బోర్డు సభ్యత్వాలు వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. టీడీపీలో సైతం పలువురు ప్రముఖులు టీటీడీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
(7 / 8)
టీటీడీ ఛైర్మన్ పదవి రేసులో జనసేన నాయకుడు నాగబాబు పేరు తెరపైకి వచ్చినా పవన్ వాటిని స్వయంగా తోసిపుచ్చారు. నామినేటెడ్ పదవులు, టీటీడీ బోర్డు సభ్యత్వాల విషయంలో తనకు తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయని ఆయన బహిరంగంగానే ప్రకటించారు.
ఇతర గ్యాలరీలు