తెలుగు న్యూస్ / ఫోటో /
Apple MacBook Air M2 | సరికొత్తగా అప్‌గ్రేడ్ అయిన ఆపిల్ మాక్‌బుక్, ధర కూడా అప్!
ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ ఇప్పుడు పూర్తిగా సరికొత్త డిజైన్‌తో వచ్చింది. తాజాగా వచ్చిన MacBook Air M2లో ప్రతి అంశం అప్‌డేట్ అయింది. దాదాపు దశాబ్దంన్నర తర్వాత ఈ మార్పులు జరిగాయి. అలాగే ఈ మాక్‌బుక్ ధర కూడా భారీగా పెరిగింది.
ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ ఇప్పుడు పూర్తిగా సరికొత్త డిజైన్‌తో వచ్చింది. తాజాగా వచ్చిన MacBook Air M2లో ప్రతి అంశం అప్‌డేట్ అయింది. దాదాపు దశాబ్దంన్నర తర్వాత ఈ మార్పులు జరిగాయి. అలాగే ఈ మాక్‌బుక్ ధర కూడా భారీగా పెరిగింది.
(1 / 7)
ఆపిల్ MacBook Air M2 14-ల్యాప్‌టాప్ సరికొత్త లుక్ తో వచ్చింది. కొత్త డిజైన్‌లో ముందు నుంచి వెనుకకు ఒకే మందంతో ఉంటుంది.ఈ మాక్‌బుక్ ఇప్పుడు మందమైన గుండ్రని అంచులను కలిగి ఉంది. Apple లోగో సైజ్ కూడా పెరిగింది.(Amritanshu / HT Tech)
(2 / 7)
Apple MacBook Air M2 13.6-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి స్లిమ్ బెజెల్స్‌తో వచ్చింది. ఇది M1 మ్యాక్‌బుక్ ఎయిర్ డిస్‌ప్లే కంటే ప్రకాశవంతంగా ఉంటుంది. ఫుల్ హెచ్డీ 1080p వెబ్‌క్యామ్ ఇచ్చారు.(Amritanshu / HT Tech)
(3 / 7)
Apple MacBook Air M2లో కీబోర్డ్ కూడా పెద్ద కీక్యాప్‌లతో కొత్తగా ఇచ్చారు. . స్లీప్ కీలో టచ్ ID ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే ఉంది.(Amritanshu / HT Tech)
(4 / 7)
ఈ సరికొత్త మాక్‌బుక్ MacOS Monterey ఆధారంగా పనిచేస్తుంది. అయితే స్టేజ్ మేనేజర్, స్పాట్‌లైట్ సెర్చ్, మరిన్ని కొత్త ఫీచర్‌లతో సంవత్సరం తర్వాత మాకోస్ వెంచురా కొత్త అప్‌డేట్‌ను పొందుతుంది.(Amritanshu / HT Tech)
(5 / 7)
Apple MacBook Air M2లో గరిష్టంగా 18 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. రెండు కాన్ఫిగరేషన్లో ఈ ల్యాప్ టాప్ వచ్చింది. 256GB వేరియంట్ లో 30W అడాప్టర్‌ను అందిస్తుండగా, 512GB వేరియంట్లో 36W డ్యూయల్ పోర్ట్ ఛార్జర్‌ను అందజేస్తున్నారు. ఇది 30 నిమిషాల్లో 0-50 శాతం చేసే 67W ఫాస్ట్ ఛార్జర్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.(Amritanshu / HT Tech)
(6 / 7)
ఛార్జింగ్ కోసం MagSafe పోర్ట్ కాకుండా థండర్‌బోల్ట్ 3, 3.1 Gen 2 స్పీడ్ ఫార్మాట్ కలిగిన రెండు USB-C పోర్ట్‌లను పొందుతారు. 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ కూడా ఉంది. ఈ ల్యాప్ టాప్ ధరలు భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 95 నుంచి రూ. 1.20 లక్షల వరకు ఉన్నాయి.(Amritanshu / HT Tech)
ఇతర గ్యాలరీలు